జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ ప్రాంతంలో అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలపై ఉగ్రదాడి పొంచి ఉందని ఇంటిలెజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

జ‌మ్మా కాశ్మీర్ లో భద్రతా దళాలపై ఐఈడీ దాడి జరిగే అవ‌కాశం ఉంద‌ని ఇంటిలెజెన్స్ నుంచి హెచ్చ‌రిక రావ‌డంతో శ్రీనగర్ సిటీ, దాని శివార్ల‌లో రెడ్ అలెర్ట్ ప్ర‌క‌టించారు. స్టిక్కీ బాంబులను ఉపయోగించి భద్రతా దళాల వాహనాలను టార్గెట్ చేసుకోవాలని ఉగ్రవాదులు యోచిస్తున్నట్లు ఇంటిలెజెన్స్ సమాచారం వచ్చిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

‘‘శ్రీనగర్ లో ఈ రోజు నుంచి రిమోట్‌ పేలుడు IED దాడికి ముప్పు పొంచి ఉంది. టార్గెట్ చేయగల ప్రదేశాలలో బాట్మాలూ మొదలైనవి ఉన్నాయి" అని ఇంటెల్ తెలిపింది. ఈ ఇంటెల్ హెచ్చ‌రిక నేప‌థ్యంలో A+ గ్రేడింగ్ ను మంజూరు చేశారు. శ్రీనగ‌ర్ నివాసులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని లోక‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ కోరింది.

Scroll to load tweet…

స్టిక్కీ బాంబులను మరెక్కడైనా ఉపయోగించే అవ‌కాశం ఉంద‌ని అయితే, ప్రధాన లక్ష్య ప్రాంతం మాత్రం బాట్మాలూ అని నివేదించించింది. ఈ నేప‌థ్యంలో బాట్మాలూ ప్రాంతం ఎక్కువగా దాడికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే డ్రైవర్లు, కో-డ్రైవర్లు, ఇతర వాహనాల్లో ప్రయాణించే దళాలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని సీనియర్ అధికారులను కోరారు. 

Scroll to load tweet…

అవసరమైతే బాట్మాలూ ప్రాంతానికి వెళ్లవద్దని భద్రతా దళాలు, నివాసితులను కోరారు. ఇదిలా ఉండగా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు స్థానిక హైబ్రిడ్ ఉగ్రవాదులను శ్రీనగర్ లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అరెస్టు చేశాయి. వారి వ‌ద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. వీరు ఇద్ద‌రు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా/ టీఆర్ఎఫ్ కు చెందిన స్థానిక హైబ్రిడ్ ఉగ్రవాదులుగా గుర్తించారు. వీరి నుంచి 15 పిస్టోళ్లు, 30 మ్యాగజైన్లు, 300 రౌండ్ల బుల్లెట్లు, సైలెన్సర్ తో పాటు మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, ఇత‌ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్న‌ట్టు కశ్మీర్ ఇన్స్ పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ విజ‌య్ కుమార్ ట్విట్ట‌ర్ లో తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.ఇది పోలీసులకు పెద్ద విజయం అని ఐజీపీ తెలిపారు.