Asianet News Telugu

ప్రజల ప్రాణాలు ముఖ్యం.. కన్వర్ యాత్రపై సుప్రీం కోర్టు

కోవిడ్-19 నేపథ్యంలో కన్వర్ యాత్రను రద్దు చేయాలని యూపీతో పలు రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. హరిద్వార్ నుంచి గంగాజలాన్ని తీసుకురావడాన్ని అనుమతించొద్దని ఆదేశాల్లో పేర్కొంది. 

Reconsider Kanwar Yatra, "Right To Life Paramount": Supreme Court To UP
Author
Hyderabad, First Published Jul 16, 2021, 1:13 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే.  మరికొద్ది రోజుల్లో దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభం కానుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో..ఉత్తరాఖండ్ ప్రభుత్వం కన్వర్ యాత్రను రద్దు చేస్తూనిర్ణయం తీసుకుంది.

ప్రజా శ్రేయస్సు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కన్వార్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ గురువారం ప్రకటించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని, దానికి తగినట్లుగానే నడుచుకుంటామని స్పష్టంచేశారు. తమ రాష్ట్రంలో కన్వర్‌ యాత్రను నిలిపేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 

మరోవైపు హరిద్వార్‌ ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడిరచారు. హరిద్వార్‌కు భక్తులు ఎవరూ రావొద్దని.. ఒకవేళ వస్తే 14 రోజుల క్వారంటైన్‌కు తరలిస్తామని హరిద్వార్‌ పోలీసులు తెలిపారు. అయితే కన్వర్‌ యాత్రను ఉత్తరాఖండ్‌ రద్దు చేసినప్పటికీ.. యూపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ నేపథ్యంలో..యూపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు పలు సూచనలు చేసింది. కోవిడ్-19 నేపథ్యంలో కన్వర్ యాత్రను రద్దు చేయాలని యూపీతో పలు రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. హరిద్వార్ నుంచి గంగాజలాన్ని తీసుకురావడాన్ని అనుమతించొద్దని ఆదేశాల్లో పేర్కొంది. 

నిర్దేశిత ప్రాంతాల్లో శివాభిషేకాలకు గంగాజలాన్ని ట్యాంకర్ల ద్వారా ఏర్పాటు చేయాలని సూచించింది. జీవించే హక్కు కంటే మత విశ్వాసాలేమీ ముఖ్యం కాదని కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే, కన్వర్ యాత్రపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ సందర్భంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. హరిద్వార్ నుంచి గంగాజలం తీసుకురావడానికి కన్వరియాలకు అనుమతి ఇవ్వొద్దని రాష్ట్రాలకు సూచించినట్టు కేంద్రం తెలిపింది. అయితే మతవిశ్వాసాలను అనుసరించి ట్యాంకర్ల ద్వారా గంగాజలం అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు పేర్కొంది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆ నీటినే సమీపంలో శివాలయాల్లో అభిషేకానికి వినియోగించుకోవలసిందిగా సూచించామని తెలిపింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గంగాజలం పంపిణీ చేసుకోవలసిందిగా భక్తులకు సూచించినట్టు సుప్రీం కోర్టుకు తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios