Asianet News TeluguAsianet News Telugu

శివసేనను మేమే కంట్రోల్ చేస్తాం.. మా ఆదేశాలను ఠాక్రే టీమ్ పాటించాల్సిందే: రెబల్స్.. గోవా హోటల్ రావాలని ఆదేశం

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మంతనాలు జరుగుతుండగా.. శివసేన పార్టీ మాత్రం అంతర్గత విభేదాల సమస్యను ఎదుర్కొంటున్నది. రెబల్ ఎమ్మెల్యేలపై ఉద్ధవ్ ఠాక్రే టీమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. తామే శివసేనను మొత్తంగా కంట్రోల్ చేస్తామని, మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న తమకే ఆ హక్కు అధికారికంగా చెందుతుందని రెబల్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అంతేకాదు, శివసేన ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ ఠాక్రే క్యాంపులోని వారు సహా.. గోవాలోని హోటల్‌లో భేటీకి హాజరుకావాలని ఓ లేఖ పంపారు.
 

rebel mlas claims control of shivsena party entire.. asks mlas to attend meet in goa hotel
Author
Mumbai, First Published Jun 30, 2022, 2:41 PM IST

ముంబయి: మహారాష్ట్ర పొలిటికల్ హైడ్రామా మహావికాస్ అఘాదీ ప్రభుత్వం కూలిపోవడమే కాదు.. శివసేన పార్టీకి పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు గురించి బీజేపీ, రెబల్ ఎమ్మెల్యేల మధ్య చర్చలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. కానీ, శివసేన పార్టీలో అంతర్గతంగా ఏర్పడ్డ విభేదాలు మాత్రం ఇంకా అగాధంలా అలాగే ఉండిపోయాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గం.. రెబల్ ఎమ్మెల్యేలు తమను వెన్నుపోటు పొడిచారని వాదించారు. వారితో తమకు సంబంధమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాగా, తామే అసలైన శివసైనికులం అని ఏక్‌నాథ్ షిండే క్యాంప్ చెప్పుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, రెబల్ ఎమ్మెల్యేలే మెజార్టీగా ఉండటంతో ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా, మెజార్టీ చట్టసభ్యులు తమతోనే ఉన్నారని, కాబట్టి, తామే శివసేనను కంట్రోల్ చేస్తామని రెబల్ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. రియల్ శివసేన ఎవరిది అనే ప్రశ్నే అవసరం లేదని, తమ దగ్గరే అధికారిక మెజార్టీ ఉన్నదని, కాబట్టి తామే లెజిస్లేచర్ పార్టీ అని రెబల్ ఎమ్మెల్యేల ప్రతినిధి దీపక్ కేసర్కర్ స్పష్టం చేశారు.

తమకు ఉద్ధవ్ ఠాక్రే కుటుంబంపై కోపమేమీ లేదని, ఇప్పటికే ఠాక్రే కుటుంబాన్ని గౌరవిస్తామని అన్నారు. ఠాక్రే కుటుంబానికి శివసేన నుంచి ఎవ్వరూ వ్యతిరేకంగా లేరని వివరించారు. ఇప్పటికీ తాము ఠాక్రేను మోసం చేయలేదనే పేర్కొన్నారు. అయితే, తాము ఠాక్రే  నుంచి దూరం కావడానికి ప్రధాన కారణం భావజాలమేనని వివరించారు. అంతేకానీ, ఎలాంటి పదవులు కాదని స్పష్టం చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తు కట్టడం సరికాదని, బీజేపీతో తమకు భావసారూప్యత ఉన్నదని, అందుకే శివసేన బీజేపీతోనే జట్టుకట్టడం సరైన నిర్ణయం అని వివరించారు.

సంజయ్ రౌత్ వ్యాఖ్యలను తాము తిప్పికొడుతున్నామని, తాము ఠాక్రేను వెన్నుపోటు పొడవలేదని అన్నారు. కానీ, బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఓటేసిన ప్రజలను శివసేన ఎమ్మెల్యేలు మోసం చేశారని తెలిపారు. శివసేన పార్టీ తన భావజాలం విషయంలో రాజీపడిందని వివరించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అప్పుడు ఓటర్ల అభిప్రాయాలకు అనుగుణమైననవి చెప్పారు.

కాగా, శివసేనను తామే కంట్రోల్ చేస్తామని, తమకే అధికారికంగా ఆ హక్కు ఉన్నదని రెబల్ ఎమ్మెల్యేలు వాదించారు. ప్రస్తుతం వారు గోవాలోని హోటల్‌లో ఉన్నారు. బీజేపీకి తమ మద్దతు ప్రకటించనున్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో రెబల్ ఎమ్మెల్యేలు శివసేనను తామే నియంత్రిస్తామని చెప్పే ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. శివసేన ఎమ్మెల్యేలు అందరూ గోవాలోని హోటల్‌లో హాజరు కావాలని ఓ లేఖను అందరు ఎమ్మెల్యేలకు రెబల్ గ్రూప్ పంపింది. గోవా హోటల్‌లో శివసేన శాసనసభా పక్ష సమావేశాన్ని ఏక్‌నాథ్ షిండే నిర్వహిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అంటే.. శివసేన పార్టీ సింబల్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ గోవా హోటల్‌లో హాజరు కావాలని రెబల్ ఎమ్మెల్యేలు ఆ లేఖలో ఆదేశించారు.

కాగా, ఈ విప్‌ను వ్యతిరేకిస్తూ ఉద్ధవ్ ఠాక్రే టీమ్ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. శివసేనలో చీఫ్ విప్‌గా ఏక్‌నాథ్ షిండేను ఇప్పటికే తొలగించామని వాదిస్తున్నది. ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేలు.. పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ పంపిన విప్ చెల్లదని పేర్కొంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios