దేశపు రియల్ హీరోలు : ఇస్రో ఛైర్మన్, రిటైర్డ్ ఎయిర్ మార్షల్, బ్యాడ్మింటన్ స్టార్లు ఒకచోట కలిసిన అపూర్వక్షణాలు..
ఆసియానెట్ న్యూస్ నెట్‌వర్క్ న్యూ ఢిల్లీ కార్యాలయంలో ఓ అపూర్వ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆసియా క్రీడలు 2023 కోసం చైనాలో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్లు, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సూరజ్ ఝాలు ఢిల్లీ కార్యాలయంలో ప్రత్యేకమైన వర్చువల్ ఎన్‌కౌంటర్‌లో కలిశారు. దేశం సాధించిన విజయాలపై పరస్పరం ప్రశంసించుకున్నారు.

ఢిల్లీ : భారతదేశ నిజమైన హీరోలు.. దేశం సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి.. వారు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడానికి విర్చువల్ గా ఒకదగ్గర కలిశారు. హద్దుల్ని చెరిపేసి, వారి వారి రంగాలకు అతీతంగా ఒకరికొకరు కలిసిన హృదయపూర్వక క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. దీనికి ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఢిల్లీ కార్యాలయం వేదిక అయ్యింది.
ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఛైర్మన్ రాజేష్ కల్రా, న్యూ ఢిల్లీ కార్యాలయంలో ఈ అపురూపమైన కలయి క్షణాలను పంచుకున్నారు. ఈ విర్చువల్ మీటింగ్ లో క్రీడలు, అంతరిక్ష పరిశోధనలు, సాయుధ దళాలు పరస్పరం ఒకరినొకరు అభినందించుకున్నారు. దేశం మీదున్న అభిమానాన్ని, దేశభక్తి ప్రదర్శించారు.
అపూర్వమైన ఈ సందర్భంలో..
- ఇటీవల చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష పరిశోధనలో భారతదేశ ఆశయాలను కొత్త శిఖరాలకు చేర్చిన ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్
- రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సూరజ్ కుమార్ ఝా, PVSM, AVSM
- 2023 ఆసియా క్రీడల కోసం ప్రస్తుతం చైనాలోని హాంగ్‌జౌలో ఉన్న కోచ్ పుల్లెల గోపీచంద్ నేతృత్వంలోని భారత బ్యాడ్మింటన్ స్టార్లు
ఉన్నారు.
ఒకరికొకరు మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ దేశం పట్ల వారి ప్రేమ, నిబద్ధత భౌగోళిక దూరాన్ని అధిగమించేలా చేసింది. ఈ వీడియో కాల్‌లో వారిని మరింత దగ్గర చేసింది. ఈ సమావేశంలో బ్యాడ్మింటన్ స్టార్లు ఇస్రో దూరదృష్టి కలిగిన నాయకుడు, రిటైర్డ్ ఎయిర్ మార్షల్‌తో సంభాషించే అవకాశం తమకు రావడం పట్ల ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ చిరస్మరణీయమైన వర్చువల్ కలయికలో అభినందన సందేశాలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతా పదాలతో ఒకరినొకరు పలకరించుకున్నారు. శాస్త్రవేత్తలు, సాయుధ దళాల విజయాలను గుర్తించే క్రీడా చిహ్నాలకు ఇది ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిలిచింది.
ఈ అపూర్వక్షణాల గురించి రాజేష్ కల్రా గతంలో ట్విటర్, ప్రస్తుత ఎక్స్‌లో షేర్ చేస్తూ.. ఇలా రాసుకొచ్చారు.. "నిన్న ఆఫీసులో ఒక అమూల్యమైన క్షణాలు చోటుచేసుకున్నాయి. ప్రేక్షకులు ఎక్కువగా అభిమానించి, కలవడానికి ఉత్సాహం చూపించే.. మన బ్యాడ్మింటన్ సూపర్‌స్టార్లు అంతరిక్ష హీరో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్‌ని చూడడానికి అంతే ఉత్సాహాన్ని చూపించడం అబ్బురపరిచింది.
దీంతో ఢిల్లీ, హ్యాంగ్‌జౌ మధ్య జరిగిన ఈ వీడియో కాల్‌లో అద్బుతక్షణాలకు ఉదాహరణగా మారింది. అటు ఆటల్లో ఇటు అంతరిక్ష సేవల్లో దేశం గర్వించదగ్గర రీతిలో ప్రదర్శిన చేసినందుకు ఒకరినొకరు అభినందించుకున్నారు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాతో పాటు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సూరజ్ ఝా కూడా ఉన్నారు. ఆయన కూడా హాజరైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన దేశ నిజమైన హీరోలను చూడటానికి - సాయుధ బలగాలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, క్రీడా-తారలు - ఒకరిని ఒకరు కలవడానికి చూపించిన ఉత్సుకత వర్ణనాతీతం. అది కేవలం అనుభవంలోనే తెలుస్తుంది. జై హింద్!" అని రాశారు.
సాయుధ దళాల సిబ్బంది, అంతరిక్ష శాస్త్రవేత్తలు, స్పోర్ట్ స్టార్స్ కలయిక, ఒకరికొకరు సాధించిన విజయాలపై ఆసక్తి చూపడం, భారతదేశ స్ఫూర్తిని బలపరిచే ఐక్యతకు ఉదాహరణ. ఇది దేశ వైవిధ్యాన్ని, భారతదేశాన్ని వివిధ రంగాలలో గర్వించేలా చేయడానికి భాగస్వామ్య నిబద్ధతను చూపించే క్షణాలు. ఈ హృదయపూర్వక కలయి.. హీరోలు అంటే వివిధ రూపాల్లో ఉంటారని.. వారి సహకారం కూడా దేశానికి అంతే ముఖ్యమైనదని గుర్తుచేస్తుంది. వారు కాస్మోస్‌ను అన్వేషించినా, సరిహద్దులను కాపాడుకున్నా, లేదా క్రీడలలో రాణించినా, అవన్నీ భారతదేశ విజయానికి దోహదపడతాయి.