శాంతి చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వానికి మావోయిస్టులు తెలిపారు. అయితే ఈ విషయమై మావోయిస్టులు కొన్ని షరతులు విధించారు. జైల్లో ఉన్న నేతలను విడిచిపెట్టాలని కోరారు.
రాయ్‌పూర్: Chhattisgarh ప్రభుత్వంతో చర్చలకు Maoists అంగీకరించారు. అయితే ఈ విషయమై Naxalites షరతులు విధించారు.Jail లో ఉన్న తమ పార్టీ నేతలను విడుదల చేయాలని ఛత్తీష్‌ఘడ్ ప్రభుత్వానికి మావోయిస్టులు షరతు విధించారు. జైల్లోని నక్సల్స్ నేతలే ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వస్తారని కూడా మావోయిస్టు పార్టీ ప్రకటించింది.
మావోయిస్టులతో తమ ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉందని ఛత్తీస్‌ఘడ్ సీఎం Bhupesh Baghel ప్రకటించిన నెల రోజుల తర్వాత మావోయిస్టుల నుండి స్పందన వచ్చింది. ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్టులు ముందుకు వచ్చారు.
ఇదిలా ఉంటే ఎలంటి షరతలు లేకపోతేనే నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలకు సిద్దంగా ఉందని ఛత్తీస్‌ఘడ్ మంత్రి ఒకరు మీడియాకు చెప్పారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కూడా ఒకటి. ప్రభుత్వం ప్రతిపాదించిన చర్చల విషయమై మావోయిస్టు పార్టీ శుక్రవారం నాడు మీడియాకు ప్రకటనను విడుదల చేసింది. ఒకవైపు చర్చలను ప్రతిపాదిస్తూనే మరో వైపు తమపై దాడులకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మావోయిస్టులు విమర్శించారు.
తమపై ఇటీవల కాలంలో Drones తో దాడి గురించి సీఎం భూపేష్ భగల్ అనుమతించారా లేదా అనే విషయమై స్పష్టత ఇవ్వాలని మావోయిస్టు పార్టీ ప్రశ్నించింది. రెండు పేజీలతో మావోయిస్టు పార్టీ మీడియాకు ప్రకటనను విడుదల చేసింది.ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి Vikalp పేరుతో మావోయిస్టు పార్టీ ఈ లేఖను విడుదల చేసింది. వికల్ప్ పలు దాడుల్లో కీలక పాత్ర పోషించారు.బస్తర్ జిల్లాలోని జిరామ్ లోయ దాడితో సహా దక్షిణ బస్తర్ లో జరిగిన పలు దాడుల్లో వికల్ప్ కీలకంగా వ్యవహరించారు.2013 మే 25న మావోయిస్టులు నిర్వహించన దాడిలో పలువురు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మరణించారు. రాజ్యాంగంపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను నక్సల్స్ ప్రతినిధి వికల్ప్ ప్రస్తావిస్తూ రాజ్యాంగ హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది.
పంచాయత్ షెడ్యూల్డ్ ప్రాంతాల పొడిగింపు చట్టం రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ లో గరామ సభకు ప్రతిపాదించిన హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది.
చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుండి సానుకూలమైన వాతావరణం కల్పిస్తే తాము కూడా చర్చలకు సిద్దమేనని కూడా మావోయిస్టు పార్టీ ప్రకటించింది.పార్టీతో పాటు పార్టీ అనుబంధ సంఘాలపై విధించిన నిషేధంతో పాటు జైల్లో ఉన్న నేతలను విడుదల చేయాలని కూడా మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది.అంతేకాదు తమపై దాడులను నిలిపివేయడంతో పాటు భద్రతా దళాల కూంబింగ్ ను కూడా నిలిపివేయాలని కూడా కోరుతుంది. మావోయిస్టుల డిమాండ్లపై సీఎం భూపేష్ భగల్ కూడా స్పందించారు. రాజ్యాంగంపై విశ్వాసం వ్యక్తం చేస్తే ఏ వేదికపైనా తాము వారితో చర్చలకు సిద్దమని కూడా సీఎం ప్రకటించారు.
తమ ప్రభుత్వం తన పథకాలతో గిరిజనుల హృదయాలను గెలుచుకొందని సీఎం భగల్ శనివారం నాడు చెప్పారు.మావోయిస్టులు పెట్టిన షరతులపై ఛత్తీష్‌ఘడ్ హోంమంత్రి తామ్రద్వాజ్ సాహు శనివారం నాడు స్పందించారు. భేషరతుగా చర్చలకు రావాలని మావోయిస్టు పార్టీని కోరారు. అలా ముందుకు వస్తేనే తాము మావోయిస్టులతో చర్చలకు సిద్దంగా ఉన్నామని కూడా ఆయన ప్రకటించారు.
దక్షిణ బస్తర్ లోని తమ రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసకొని భద్రతా బలగాలు దాడులు చేశాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. దీన్ని బస్తర్ పోలీసులు ఖండించారు.దండకారణ్య ప్రాంతంలో తమ పట్టు కోల్పోవడంతో తమపై మావోయిస్టు పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని బస్తర్ డివిజన్ పోలీసులు ప్రకటించారు.
2004 లో ఉమ్మడి Andhra Pradesh రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపింది.ఈ చర్చలకు మావోయిస్టు అగ్రనేతలు అడవి నుండి బయటకు వచ్చారు. ఆ సమయంలో హోం మంత్రిగా జానారెడ్డి ఉన్నారు. అయితే చర్చలు విఫలమయ్యాయి. చర్చలకు అడవి నుండి వచ్చిన మావోల ఉనికిని తెలుసుకొన్న పోలీసులు ఆ తర్వాత ఆ పార్టీ అగ్రనేతలను మట్టుబెట్టారు. ఈ చర్చల తర్వాత ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ తీవ్రంగా దెబ్బతింది.
