మీ దగ్గరున్న రెండు వేల రూపాయల నోట్లను ఎలా మార్చుకోవాలంటే..?
RBI Withdraws Rs 2,000 Notes: రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ మే 19 శుక్రవారం ప్రకటించింది. అయితే, అధికారికంగా చెల్లుబాటు అవుతాయని తెలిపింది. తమ వద్ద ఉన్న 2000 రూపాలయ నోట్లను మార్చుకోవాలని సూచించింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు రూ.2,000 నోట్ల మార్పిడికి అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉత్తర్వులు జారీ చేసింది.
RBI announcement to withdraw 2000 notes: రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ మే 19 శుక్రవారం ప్రకటించింది. అయితే, అధికారికంగా చెల్లుబాటు అవుతాయని తెలిపింది. తమ వద్ద ఉన్న 2000 రూపాలయ నోట్లను మార్చుకోవాలని సూచించింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు రూ.2,000 నోట్ల మార్పిడికి అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాల్లోకెళ్తే.. 2000 వేల రూపాలయ నోటుపై తాము తీసుకున్న నిర్ణయంతో ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆర్బీఐ తెలిపింది. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తమ వద్ద ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవచ్చునని భరోసా ఇచ్చింది. సెప్టెంబర్ 30లోగా 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ నోట్లను ఇప్పట్లో జారీ చేయబోమని ఆర్బీఐ చెప్పడంతో పాటు చలామణిలో ఉన్న నోట్లను ఉపసంహరించుకునే కసరత్తు కూడా ప్రారంభమైంది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత మరోసారి సామాన్యుల మదిలో నోట్లరద్దు శకం మొదలైంది. నోట్ల మార్పిడి కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లు, గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆందోళనలు ఉన్నాయి. సెప్టెంబర్ 30 వరకు గరిష్టంగా 10 రూ.2,000 నోట్లను మార్చుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. అయితే మీ దగ్గర ఎన్ని రెండు వేల రూపాయల నోట్లు ఉన్నా వాటిని ఎలా డిపాజిట్ చేయాలో కూడా ఆర్బీఐ వివరించింది.
ఒకేసారి 10 రూ.20,000 వరకు మాత్రమే మార్చుకోవచ్చు..
మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు రూ.2,000 నోట్ల మార్పిడికి అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఒకేసారి గరిష్టంగా పది నోట్లను అంటే రూ.20 వేల వరకు మార్చుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. ఆర్బీఐ ఇకపై కొత్త రూ.2,000 నోట్లను విడుదల చేయదు.
ఈ విధంగా మీరు ఎన్ని 2000 రూపాయల నోట్లను అయినా మార్చుకోవచ్చు...
ఆర్బీఐ ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా పది నోట్లను ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు. అయితే, అతను తన బ్యాంక్ ఖాతాలో కూడా డిపాజిట్ చేయవచ్చు. ఒక వ్యక్తి తన ఖాతాలో జమ చేయడం ద్వారా రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవాలనుకుంటే, అతను కోరుకున్నన్ని నోట్లను డిపాజిట్ చేయడం ద్వారా వాటిని మార్చుకోవచ్చు. అయితే, అతని ఖాతాకు కేవైసీ తప్పనిసరిగా ఉండాలి. కేవైసీ లేనిదే రూ.2,000 నోట్లు ఖాతాలో జమ కావని కూడా బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.