రూ.2 వేల నోట్లు ఉపసంహరించుకుంటున్నామని రిజర్వ్ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. మే 23 నుంచి ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది

రూ.2 వేల నోట్లు ఉపసంహరించుకుంటున్నామని రిజర్వ్ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. సెప్టెంబర్ 30లోగా ఆ నోట్లను బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేసుకోవాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. మే 23 నుంచి ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. రూ. 2 వేల నోట్లను సర్కూలేషన్‌లో వుంచొద్దని బ్యాంక్‌లను ఆదేశించింది. దేశంలో వున్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

2018-19 ఆర్ధిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఒక విడతలో రూ.20 వేలు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. దేశంలో రూ.3.52 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చెలామణీలో వున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది

Scroll to load tweet…