ఆర్బీఐ ప్రకటనతో మార్కెట్లలో స్థిరత్వం: బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్బీఐ స్థిరమైన, కచ్చితమైన స్టెప్స్ తో ముందుకు వచ్చిందని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్బీఐ స్థిరమైన, కచ్చితమైన స్టెప్స్ తో ముందుకు వచ్చిందని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.
లాక్ డౌన్ నేపథ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకొంటున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం నాడు ప్రజలకు వివరించారు. ఈ విషయమై ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
రాష్ట్రాలకు డబ్ల్యూఎంఏ పరిమితిని పెంచడం వంటి పరిణామాలు మార్కెట్లలో నమ్మకాన్ని కల్పిస్తాయన్నారు. అంతేకాదు మార్కెట్లలో స్థిరత్వం కూడ వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడేందుకు దోహదపడే అవకాశం ఉందన్నారు.
ఆర్బీఐ చెప్పినట్టుగా చేయడమే మార్గమన్నారు. కానీ, వచ్చే ఏడాది మాత్రం మన ఆర్దిక వ్యవస్థ గాడిలో పడి గర్జించే అవకాశం ఉందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ నేపథ్యంలో కూడ భారత జీడీపీ 2021-22లో 7.4 జీడీపీ వృద్ధిరేటును ఇండియా సాధించనున్నట్టుగా అంచనా వేస్తున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. జీ20 దేశాల్లో అందరికంటే ఎక్కువ జీడీపీ ఉన్న దేశంగా ఆయన గుర్తు చేశారు.