Asianet News TeluguAsianet News Telugu

యాప్‌ల మాయలో పడొద్దు.. మీ డేటా ఇవ్వొద్దు: ఆర్‌బీఐ

మైక్రో ఫైనాన్సింగ్ యాప్‌ల బాగోతంపై ఆర్‌బీఐ స్పందించింది. ఆర్‌బీఐ, ఎన్‌బీఎఫ్‌సీకి లోబడి వున్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

rbi reacts micro finance apps ksp
Author
New Delhi, First Published Dec 23, 2020, 4:12 PM IST

మైక్రో ఫైనాన్సింగ్ యాప్‌ల బాగోతంపై ఆర్‌బీఐ స్పందించింది. ఆర్‌బీఐ, ఎన్‌బీఎఫ్‌సీకి లోబడి వున్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

కొన్ని యాప్‌లు అధిక వడ్డీలు, రుసుములు తీసుకున్నట్లు తెలిసిందని.. సులభంగా రుణాలు ఇస్తున్నారని యాప్‌ల మాయలో పడొద్దని ఆర్‌బీఐ సూచించింది.

వ్యక్తిగత డాక్యుమెంట్లు ఎవరికీ ఇవ్వొద్దని ఆర్‌బీఐ సీజీఎం యోగేశ్ దయాల్ అన్నారు. యాప్ మోసాలపై sachet.rbi.org.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ఆర్‌బీఐ తెలిపింది.

ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో యాప్‌ల ద్వారా అనేక మందికి నగదు రుణాలు అందించి వాటిని తిరిగి చెల్లించే క్రమంలో చేసిన వేదింపులను భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జరిగాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios