Asianet News TeluguAsianet News Telugu

ఆరెస్సెస్‌ కార్యాలయంలో  అడుగు పెట్టను.. అలా చేయాల్సి వస్తే.. తల తీసేసుకుంటా: రాహుల్‌గాంధీ 

అధికార భారతీయ జనతాపార్టీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (RSS)కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ అగ్రనేత, వాయనాడ్‌ ఎంపీ రాహుల్‌గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

Rather be beheaded than step into RSS office, says Rahul Gandhi
Author
First Published Jan 17, 2023, 11:03 PM IST

భారతీయ జనతాపార్టీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై రాహుల్ గాంధీ వివాదాస్పద ప్రకటన చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి ఎప్పటికీ వెళ్లలేనని, అలాంటి పరిస్థితి ఏర్పడితే.. తాను ముందుగా గొంతు కోసుకుంటానని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరనున్నారనే ఊహాగానాలు తీవ్రమయ్యాయి. ఆ ఊహాగానాలను తెరదించేలా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాను ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి వెళ్లలేననీ, తన గొంతు కోసినా ఆ పని చేయలేనని అన్నారు. తన  కుటుంబానికి ఒక భావజాలం ఉందనీ, దానికి ఒక ఆలోచనా విధానం ఉందని అన్నారు. తాను వరుణ్‌ని కలవగలను, కౌగిలించుకోగలను కానీ ఆ భావజాలాన్ని అంగీకరించలేననీ, అది అసాధ్యమని అన్నారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను అనుసరిస్తున్నారని అందుకు తాను విరుద్దమని అన్నారు. 

భారత్ జోడో యాత్ర మంగళవారం హోషియార్‌పూర్‌లోని దాసుహా-ముకేరియన్ రహదారిపై సాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో రాహుల్ మాట్లాడారు. వరుణ్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో చేరడంపై రాహుల్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థలపై బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఒత్తిడి చేస్తున్నాయనీ, కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలపై ఒత్తిడి ఉందన్నాదని అన్నారు.

మీడియాపై ఒత్తిడి ఉంది, అధికార యంత్రాంగంపై ఒత్తిడి ఉంది, ఎన్నికల సంఘంపై ఒత్తిడి ఉంది. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చారు. ఇది ఒక రాజకీయ పార్టీకి, మరో రాజకీయ పార్టీకి మధ్య జరిగే పోరాటం కాదు. ఇప్పుడు వారు నిర్వహిస్తున్న సంస్థలకు, ప్రతిపక్షాలకు మధ్య పోరు జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో సాధారణ ప్రజాస్వామ్య ప్రక్రియలు లేకుండా పోతున్నాయని ఆయన అన్నారు. ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, ధరల పెరుగుదల బీజేపీకి గట్టి దెబ్బేనని ఆయన అన్నారు.

ధనిక, పేదల మధ్య అంతరాన్ని కూడా ప్రశ్నించారు. 

దేశంలో ధనిక, పేదల మధ్య అంతరం పెరుగుతోందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశంలోని 50 శాతం మంది పేద ప్రజలు 64 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. అదే సమయంలో, దేశంలోని ధనవంతులలో 10 శాతం మంది కేవలం 3 శాతం జీఎస్టీని చెల్లిస్తున్నారు. దేశ సంపదలో 40 శాతం ఒక శాతం సంపన్నుల ఆధీనంలో ఉండగా, దేశ జనాభాలో 50 శాతం మంది వద్ద కేవలం మూడు శాతం సంపద మాత్రమే ఉందన్నారు. ఈ విషయాలను దేశంలోని మీడియా ప్రశ్నించడం లేదన్నారు.

భద్రతా లోపం 
 
మంగళవారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రెండుసార్లు భద్రతా లోపం జరిగింది. జలంధర్-పఠాన్‌కోట్ రహదారిపై దాసుహా సమీపంలో ఉదయం 8:05 గంటలకు, ఒక యువకుడు మూడంచెల భద్రతా వలయాన్ని ఛేదించి రాహుల్ వద్దకు చేరుకుని అతన్ని కౌగిలించుకున్నాడు. ఇది చూసిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వార్డింగ్ ముందుకొచ్చి యువతను వెనక్కి నెట్టారు. భద్రతా సిబ్బంది కూడా యువకుడి వద్దకు దూసుకెళ్లారు. అనంతరం హోషియార్‌పూర్ పోలీసులకు అప్పగించారు. అలాగే.. బస్సీ గ్రామంలోని కిసాన్ హట్ ధాబా వద్ద ఉదయం 8.40 గంటలకు భద్రతలో రెండో లోపం చోటుచేసుకుంది. రాహుల్‌ గాంధీ రోడ్డు దాటేందుకు ముందుకు వెళుతుండగా, తలపై కేసరి పారణం కట్టుకున్న ఓ యువకుడు రాహుల్‌కు దగ్గరగా వచ్చాడు. వెంటనే పసిగట్టిన భద్రతా సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

భద్రత విషయంలో ఎలాంటి లోపం లేదని, ఇది కార్యకర్తల ఉత్సాహమని రాహుల్ అన్నారు. ఈ రెండు ఘటనలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన భద్రతలో ఎలాంటి లోటు లేదని, ఇది కార్యకర్తల ఉత్సాహమని అన్నారు. ఎవరో వచ్చి నన్ను కౌగిలించుకుని వెళ్లిపోయారు. ఇలాంటి సంఘటనలు ఉత్సాహంతో జరుగుతాయని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios