హైదరాబాద్‌లో ప్రారంభమైన ఆరెస్సెస్ సమన్వయ సమావేశాలు.. వీటిపైనే చర్చ..
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh), సోషల్ లైఫ్‌కు సబంధించి వివిధ రంగాలలో పనిచేస్తున్నఅనుబంధ విభాగాలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో కూడిన అఖిల భారతీయ సమన్వయ సమావేశం నేడు(జనవరి 5) భాగ్యనరంలో ప్రారంభం అయ్యాయి.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh), సోషల్ లైఫ్‌కు సబంధించి వివిధ రంగాలలో పనిచేస్తున్నఅనుబంధ విభాగాలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో కూడిన అఖిల భారతీయ సమన్వయ సమావేశం నేడు(జనవరి 5) భాగ్యనరంలో ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు సాగనున్నాయి. ఏడాదికి ఒకసారి ఈ సమగ్ర సమావేశాలకు.. ఈ సారి హైదరాబాద్ శివారులోని అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రం వేదికంగా నిలిచింది. ఈ కార్యక్రమంలోనే ఆరెస్సెస్ సర్‌సంఘచాలక్ మోహన్ భగవత్ (Mohan ji Bhagwat), సర్‌కార్యవహ్ (ప్రధాన కార్యదర్శి) దత్తాత్రేయ హోస్బలేలతో పాటుగా ఐదుగురు సహ సర్‌కార్యవహ్, సంఘ్‌కు చెందిన ఇతర ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు
ముప్పై ఆరు ప్రేరేపిత సంస్థలకు చెందిన 216 మంది ఆఫీస్ బేరర్లు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి హాజరవుతున్నవారు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోరని.. కేవలం సమాచారాన్ని మాత్రమే పంచుకోనుందని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
గతేడాది గుజరాత్‌లోని కర్ణావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో భారతీయ మజ్దూర్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, లఘు ఉద్యోగ్ భారతి.. తదితర సంస్థలు దేశంలో ఉపాధిని మెరుగుపరిచే ప్రణాళికలపై చర్చించాయి. ప్రభుత్వ విధానాలు, క్షేత్ర స్థాయి పరిస్థితులపైన కూడా చర్చలు జరిపాయి.
ఈ సంవత్సరం విద్యాభారతి, ఏబీవీపీ, భారతీయ శిక్ష్ మండల్‌తో పాటు ఇతర విద్య సముహలు.. దేశంలో కేంద్రీకృతమైన విద్య గురించి చర్చించనున్నారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించి అనుభవాలను పంచుకోనున్నారు. ఇక, కోవిడ్ సమయంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, పిల్లలలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి సేవా భారతి చేపట్టిన వివిధ కార్యక్రమాలు ఇక్కడ పంచుకోబడతాయి.
కొన్ని సంవత్సరాల్లో.. సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలోనే పరివారణం (పర్యావరణ), పరివార్ ప్రబోధన్ (కుటుంబ అవగాహన), సామాజిక సమరస్తా (సామాజిక సామరస్యం) కార్యక్రమాలపై సమావేశంలో చర్చలు జరగనున్నాయి. 75వ స్వాతంత్ర్య వేడుకల్లో అన్ని సంస్థలు పాల్గొంటున్నాయి. ఇందుకు సంబంధించి వారు నిర్వహించిన కార్యక్రమాలు, స్పెషల్ డ్రైవ్‌లపై కూడా చర్చించనున్నారు. సమావేశాల ముగింపు రోజైన జనవరి 7వ తేదీన మధ్యాహ్నం సంఘ్ సహ సర్‌కార్యవహ్ మన్మోహన్‌జీ వైద్య.. సమావేశ చర్చల గురించి మీడియాకు వివరించడం జరుగుతుంది.