రెండు తలలు, మూడు చేతులతో అభివక్త కవలలు జన్మించారు. వారిద్దరూ ఒకరినొకరు అతుక్కొని జన్మించారు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఒడిశాకు చెందిన ఓ మహిళ ఆదివార కవలలకు జన్మనిచ్చింది. కాగా... ఆ కవలలు అభివక్త కవలలు కావడం గమనార్హం. అంటే పుట్టుకతోనే వారి ఇద్దరి శరీరాలు అతుక్కొని పుట్టాయనమాట. కేంద్రపార జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సదరు మహిళ ఈ బిడ్డలకు జన్మనిచ్చింది.

కవలలకు రెండు తలలు, మూడు చేతులు ఉన్నాయని.. శరీరం మాత్రం ఒక్కటే ఉందని వారు చెప్పారు. కాగా.. తదుపరి చికిత్స కోసం ఆ అభివక్త కవలలను శిశు భవన్ కి తరలించినట్లు వైద్యులు చెప్పారు.

కాగా... ఇలాంటి చిన్నారులు సాధారణ జీవితం గడపటం చాలా కష్టమని వైద్యులు తెలిపారు. ఎక్కువ కాలం బతుకుతారనే గ్యారెంటీ కూడా లేదని చెప్పారు. స్త్రీ గర్భంలోని పిండం సరిగా అభివృద్ధి చెందని సమయంలో ఇలాంటి జననం జరుగుతుందని వైద్యులు తెలిపారు. పది లక్షల మందిలో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉందని తెలిపారు.