Asianet News TeluguAsianet News Telugu

రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలి - మరో సారి మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. 

Rapists should be hanged in public - Madhya Pradesh Minister Usha Thakur's sensational comments once again
Author
First Published Nov 15, 2022, 5:00 PM IST

మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. మరో సారి అలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలంటే రేపిస్టుల అంత్యక్రియలకు కూడా అనుమతించకూడదని చెప్పారు. ఇండోర్ జిల్లాలోని మోవ్ తహసీల్‌లోని కొడారియా గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన సభలో ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

G20 summit: ప్రధాన రంగాలలో ద్వైపాక్షిక సహకారంపై ప్రధాని మోడీ, యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ సమీక్ష

‘‘కూతుళ్లపై అత్యాచారం చేసిన వారిని బహిరంగంగా ఉరితీయాలని, అలాంటి వారి అంత్యక్రియలకు కూడా అనుమతి ఇవ్వకూడదని కోరుకుంటున్నాను. అలాంటి వ్యక్తి మృతదేహాన్ని డేగలు, కాకులు పొడవాలి. ఈ దృశ్యాన్ని అందరూ చూస్తుంటే కూతుళ్లను ముట్టుకోడానికి మళ్లీ ఎవరూ సాహసించరు.’’ ఠాకూర్ ఆ వీడియోలో అన్నారు.

ఆమె వ్యాఖ్యలపై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఇలాంటివి వీలైనంత ఎక్కువ మందికి చేరాలని, ఈ విషయాలు సమాజ హితం కోసమే అని చెప్పారు. రేపిస్టులు బహిరంగంగా నేరాలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల వారిలో భయం లేదని చెప్పారు. రేపిస్టులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ సంతకాల ప్రచారం నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి కుటుంబంలోని మహిళలు ఈ ప్రచారంలో పాల్గొనాలని ఠాకూర్ అన్నారు.

ఆ సంస్థకు నిర్వహణ బాధ్యతలు ఎలా అప్పగించారు? మోర్బీ బ్రిడ్జి ఘటనపై గుజరాత్ హైకోర్టు సీరియస్

ఉషా ఠాకూర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ఇటీవల మధ్యప్రదేశ్ ఖాండ్వాలో నాలుగు సంవత్సరాల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై కూడా ఆమె ఇదే విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలు చేసేవారిని బహిరంగంగా ఉరి తీయాలని, అలా చేస్తేనే నేరాలు అదుపులో ఉంటాయని చెప్పారు. కాగా ఆమె మధ్యప్రదేశ్ కేబినేట్ లో మంత్రి ఉషా ఠాకూర్ సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు. 

ఎయిరిండియాకు షాకిచ్చిన అమెరికా.. దాదాపు 1000 కోట్ల చెల్లించాలని ఆదేశం .. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల‌ ముందు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గార్బా వేదికలపైకి హిందువులు కాని వారిని, ముఖ్యంగా ముస్లింలు ప్రవేశించడాన్ని నిషేధించడానికి ఆధార్ కార్డులను తెచ్చుకోవాలని సూచించారు. 2017 లో కూడా ఆమె ఇలాంటి డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios