Asianet News TeluguAsianet News Telugu

ఆ సంస్థకు నిర్వహణ బాధ్యతలు ఎలా అప్పగించారు? మోర్బీ బ్రిడ్జి ఘటనపై  గుజరాత్ హైకోర్టు సీరియస్  

150 ఏళ్ల నాటి మోర్బీ బ్రిడ్జి కుప్పకూలి 130 మందికి పైగా మరణించిన ఘటనపై గుజరాత్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. బ్రిడ్డి నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టు ను ఒరెవా గ్రూప్‌కు  ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. నోటీసులిచ్చినా  సంబంధిత అధికారులు కోర్టుకు ఎందుకు రాలేదని, ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాకుండా మేధావిగా వ్యవహరిస్తున్నారని కోర్టు విమర్శించింది. 

Gujarat High Court's Strong Remarks On Morbi Bridge Tragedy
Author
First Published Nov 15, 2022, 4:11 PM IST

మోర్బీ బ్రిడ్జి కేసుపై గుజరాత్ హైకోర్టు స్పందన: గుజరాత్ లో జరిగిన మోర్బి బ్రిడ్జి ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఒరెవా గ్రూప్‌కు బ్రిడ్జి నిర్వహణ బాధ్యతలను అప్పజేప్పిన తీరును గుజరాత్ హైకోర్టు మంగళవారం (నవంబర్ 15) విమర్శించింది. ఎలాంటి టెండర్లు వేయకుండా బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టును ఎలా అప్పగిస్తారని నిలదీసింది. ఈ విషయంలో రాష్ట్ర ఔదార్యాన్ని చాటుకున్నట్లు కనిపిస్తోందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అలాగే..  బ్రిడ్జి మరమ్మతు పనులకు ఎందుకు టెండర్లు వేయలేదని చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ చీఫ్ సెక్రటరీని ప్రశ్నించారు. అలాగే.. బిడ్‌లను ఎందుకు ఆహ్వానించలేదని మోర్బీ మున్సిపాలిటీని కూడా కోర్టు మందలించింది. అదే సమయంలో మున్సిపాలిటీకి నోటీసులిచ్చినా నేటికీ అధికారులెవరూ విచారణకు హాజరుకాకపోవడంపై  హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మోర్బీ పౌర సంస్థ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని  ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

వంతెన పునఃప్రారంభానికి ముందు దాని ఫిట్‌నెస్‌ను ధృవీకరించకపోవడం  ఏదైనా ఒప్పందంలో భాగమేనా అని ప్రశ్నించింది. బాధ్యత వహించే వ్యక్తి ఎవరు అనే వివరాలతో కోర్టులో హాజరు కావాలని  అది అధికారుల బాధ్యత అని తెలిపింది. సివిక్ బాడీ చీఫ్ ఆఫీసర్‌పై క్రమశిక్షణా చర్యలు ఎందుకు ప్రారంభించబడలేదో రాష్ట్రం రికార్డు కారణాలను కూడా అందించాలని పేర్కొంది. దీనికి సంబంధించి ఎలాంటి టెండర్‌లు వేయకుండానే రాష్ట్రానికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. "పబ్లిక్ బ్రిడ్జి మరమ్మతు పనులకు టెండర్ ఎందుకు వేయలేదు? బిడ్లను ఎందుకు ఆహ్వానించలేదు?"  ఈ కేసు ప్రారంభ విచారణలో చీఫ్‌ జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ రాష్ట్ర అత్యున్నత బ్యూరోక్రాట్‌ చీఫ్‌ సెక్రటరీని ప్రశ్నించారు. 

ఒరెవా గ్రూప్‌కు మోర్బీ మున్సిపాలిటీ 15 ఏళ్ల కాంట్రాక్టును ఇచ్చింది. ఇంత ముఖ్యమైన అగ్రిమెంట్ కేవలం ఒకటిన్నర పేజీల్లో ఎలా పూర్తయిందని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఏ టెండర్ వేయకుండానే ఒరెవా గ్రూప్‌కు ఎలా ఇచ్చారని కోర్టు నిలదీసింది. జూన్ 2017 తర్వాత "[2008లో సంతకం చేసిన ఒప్పందం] పునరుద్ధరించబడనప్పుడు కూడా" వంతెనను కంపెనీ ఏ ప్రాతిపదికన నిర్వహిస్తోందో వివరించాలని  కోరింది. ఈ ఏడాది కొత్త ఒప్పందం కుదిరింది. ఈ విషాదాన్ని కోర్టు స్వయంగా గమనించి కనీసం ఆరు శాఖల నుండి సమాధానాలు కోరింది. 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశుతోష్ జె శాస్త్రి దీనిపై విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు, కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన కొంతమంది సిబ్బందిని మాత్రమే అరెస్టు చేశారు. అయితే ₹ 7 కోట్ల ఒప్పందంపై సంతకం చేసిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోలేదు. ఈ విచారణలో కంపెనీ తుప్పుపట్టిన కేబుళ్లను మార్చలేదని, అయితే చాలా బరువుగా ఉన్న కొత్త ఫ్లోరింగ్‌ను ఏర్పాటు చేసిందని తేలింది. ఒప్పందానికి సంబంధించిన ఫైళ్లను సీల్డ్ కవరులో సమర్పించాలని కోర్టు కోరింది. 

గుజరాత్ ప్రభుత్వం ఏమంటుంది? 

మెరుపు వేగంతో పనిచేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడినట్లు ప్రభుత్వం నివేదికను సమర్పించింది. "తొమ్మిది మందిని అరెస్టు చేశారు, ఇంకా ఎవరైనా దోషులుగా తేలితే, మేము ఖచ్చితంగా వారిపై కేసు నమోదు చేస్తాము. బాధితులకు నష్టపరిహరం అందించాం " అని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 లను నష్ట పరిహారంగా అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే.. తన సొంత రాష్ట్రంలోని విపత్తు ప్రాంతాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ, మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుండి   ₹ 2 లక్షల చొప్పున ప్రకటించారు.

మరోసారి మోర్బీ పురపాలక సంస్థకు నోటీసులు చేయాలని మోర్బి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ, కాంట్రాక్ట్ గురించి కొన్ని వివరణలు అవసరమని పేర్కొంది. కలెక్టరు, కాంట్రాక్టర్ మధ్య జూన్ 16, 2008న ఎంఓయూ (మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్) సంతకం చేసినట్లు కాలక్రమానుసార సంఘటనల జాబితా సూచిస్తుందని పేర్కొంది. 

ఈ ఒప్పందం ప్రకారం సస్పెన్షన్ బ్రిడ్జికి సంబంధించి ఆపరేట్ చేయడం, నిర్వహించడం, అద్దె వసూలు చేయడం వంటి బాధ్యతలు జూన్ 15, 2017తో ముగిసిపోయింది. అందువల్ల ప్రధాన ప్రశ్న ఏమిటంటే.. ఈ ఎమ్‌ఓయు ప్రకారం 2017లో పదవీకాలం ముగిసిన తర్వాత, టెండర్‌ను తేవడానికి మోర్బి సివిల్ బాడీ,  కలెక్టర్ ఏమి చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios