Asianet News TeluguAsianet News Telugu

గర్భం దాల్చిన అత్యాచార బాధితురాలు.. యూట్యూబ్ లో చూసి అబార్షన్..!

ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కూడా ఒత్తిడి చేశాడు. దీంతో.. అతని బలవంతం మేరకు  ఆ గర్భం  ఎలాగైనా తీసేయాలని అనుకుంది. ఈ క్రమంలో.. యూట్యూబ్ లో చూసి తనకు తాను స్వయంగా అబార్షన్ చేసుకుంది.

Rape survivor performs self abortion after watching youtube videos
Author
Hyderabad, First Published Sep 27, 2021, 10:20 AM IST

ఓ యువతి కామాంధుని కామానికి బలైంది.  ఓ వ్యక్తి ఆమెపై బలవంతంతగా అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో.. ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయం అందరికీ తెలిస్తే తన పరువు పోతుందని బాధితురాలు బావించింది. అంతేకాదు.. ఆ గర్భం తొలగించుకోవాలని ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కూడా ఒత్తిడి చేశాడు. దీంతో.. అతని బలవంతం మేరకు  ఆ గర్భం  ఎలాగైనా తీసేయాలని అనుకుంది. ఈ క్రమంలో.. యూట్యూబ్ లో చూసి తనకు తాను స్వయంగా అబార్షన్ చేసుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 ఆమె ఏడు నెలల గర్భాన్ని బలవంతంగా తొలగించుకుని ఒక మృతశిశువుకు జన్మనిచ్చింది. అబార్షన్ చేసుకునేందుకు తన ఇంటిలో అందుబాటులో ఉన్న పరికరాలను వినియోగించింది. ఫలితంగా ఆమె శరీరానికి ఇన్షెక్షన్ సోకింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెపై అత్యాచారం జరిపిన వ్యక్తే అమెను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. అతనికి అప్పటికే వివాహం కావడంతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 2016 నుంచి తాను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అప్పటినుంచి పలుమార్లు తనను శారీకరంగా కలిశాడని పేర్కొంది. ఈ నేపధ్యంలోనే గర్భవతిని అయ్యానని, అయితే తనను అబార్షన్ చేయించుకోవాలని అతను ఒత్తిడి చేశాడని, పెళ్లి చేసుకునేందుకు కూడా నిరాకరించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడు సోహెల్ వాహబ్ ఖాన్ ను అత్యాచార ఆరోపణలపై అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios