న్యూఢిల్లీ: జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో  డేరా బాబాకు జీవిత ఖైదును విధిస్తూ గురువారం నాడు పంచకుల ప్రత్యేక కోర్టు తీర్పును ఇచ్చింది.

గురురామ్ రహీమ్ మరో ముగ్గురిని జర్నలిస్ట్‌ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో దోషులుగా కోర్టు ఇటీవలనే తేల్చింది.ఈ కేసుకు సంబంధించి కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ కేసులో  డేరాబాబాతో పాటు మరో ముగ్గురికి జీవిత ఖైదును విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.

అంతేకాదు ఈ నిందితులకు రూ.50వేలు జరిమానాను కూడ విధించింది.  2002లో రామచంద్ర ఛత్రపతి హత్యకు గురయ్యారు.ఆశ్రమంలో  మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్షను  డేరా బాబా అనుభవిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

జర్నలిస్ట్ హత్య: డేరాబాబా‌తో పాటు మరో ముగ్గురు దోషులు