బాలీవుడ్ యాక్టర్ రణ్ దీప్ హుడా వివాదంలో చిక్కుకున్నాడు. ఓ పాత వీడియో క్లిప్పు ఇప్పుడు అతనికి చిక్కులు తెచ్చిపెట్టింది. యూపీ మాజీ సీఎం మాయావతి పై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇప్పుడాయన ఇమేజీకి తీవ్రమైన డ్యామేజ్ గా మారింది. 

కులాన్ని కించపరిచేలా కామెంట్ చేస్తూ సెలబ్రిటీలు వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. మున్​మున్​ దత్తా, యూవికా చౌదరి కామెంట్లపై రచ్చ.. ఆపై వాళ్లు దిగొచ్చి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ లిస్టులో తాజాగా  రణ్​దీప్​ హుడాను చేర్చారు నెటిజన్స్.

బాలీవుడ్లో ఫైనెస్ట్​ ఆర్టిస్ట్​గా పేరున్న రణ్​దీప్​..  యూపీ మాజీ సీఎం మాయావతి పై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డాడు. అయితే రణ్ దీప్ ఆ కామెంట్ చేసి చాలా కాలం అవుతుండటం విశేషం.

గతంలో ఓ ఈవెంట్లో పాల్గొన్న రణ్ దీప్ హుడా యూపీ మాజీ సీఎం మాయావతి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీకు ఇప్పుడు ఒక డర్టీ జోక్​ చెప్పబోతున్నా’.. అంటూ మాయావతి వేషధారణ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.  తీరా ఇప్పుడు వరుసగా వివాదాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో రణ్​దీప్​ హుడా వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ, క్షమాపణలు చెప్పాల్సిందేనని నెటిజన్లు పట్టుబడుతున్నారు.

 ఒక మహిళా సీఎం,  ఆమె సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ రణ్ దీఫ్ పై మండిపడుతున్నారు. ఆడవాళ్ళ పట్ల అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని వదలకూడదు అని చెబుతూ... అతన్ని అరెస్టు చేయాలంటూ #ArrestRandeepHooda హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై రణ్ దీప్ హుడా  క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

మరికొందరు రణ్ దీప్ హుడాకు కులగజ్జి ఉందని, మానవత్వం లేని వాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అతని సినిమాల్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై రణ్ దీప్ హుడా రియాక్ట్ కావాల్సి ఉంది. ఇక 2012లో మాయావతిపై అభ్యంతరకరమైన ట్వీట్ చేసిన  స్టాండప్​ కమెడియన్​ అభిష్​ మాథ్యూ.. రీసెంట్ గా నెటిజన్ల ఆగ్రహంతో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.