Asianet News TeluguAsianet News Telugu

గురుద్వారాలో హోలా మొహల్లా ఆపేందుకు పోలీసుల యత్నం.. దాడి..!

హోలా మొహల్లా కార్యక్రమాన్ని ఆపాలని చూస్తున్నారని.. ప్రజలు...పోలీసులకు ఎదురు తిరిగారు. పోలీసులపైనే దాడి చేశారు.

Rampage at gurudwara in Maharashtra, sword-wielding mob attacks cops
Author
Hyderabad, First Published Mar 30, 2021, 7:31 AM IST

మహారాష్ట్రలోని గురుద్వారాలో ప్రతి సంవత్సరం హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ‘హోలా మొహల్లా’ కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా.. దానిని ఆపేందుకు వెళ్లిన పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. తమ హోలా మొహల్లా కార్యక్రమాన్ని ఆపాలని చూస్తున్నారని.. ప్రజలు...పోలీసులకు ఎదురు తిరిగారు. పోలీసులపైనే దాడి చేశారు.

పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు అతి కష్టం మీద పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.  కాగా... మహారాష్ట్రలోని నాందేడ్‌లో సచ్‌ఖండ్ హజూర్ సాహిబ్ గురుద్వారాలో హోలీ సందర్భంగా హోలా మహల్లా కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు వారికి సూచించారు. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ అధిక సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. వీరిని చూసిన  నిర్వాహకులు గురుద్వారా గేటుకు తాళం వేశారు. అయితే ఇది అక్కడున్న కొంతమందికి నచ్చలేదు. వారు ఆ గేటును పగులగొట్టారు. ఈ కారణంగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో పాటు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన అల్లరి మూకలు వారిపై దాడికి దిగారు. పోలీసులపై కత్తి ఝుళిపించారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు గాయాలపాలయ్యారు. అల్లరి మూకలు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న డీఐజీ నిసార్ తాంబోలీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అతి కష్టంమీద పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios