ఏపీ కొత్త గవర్నర్ గా అబ్దుల్ నజీర్: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

 పలు రాష్ట్రాలకు  కొత్త గవర్నర్లను     నియమించారు.  ఏపీ గవర్నర్ గా  అబ్దుల్  నజీర్  నియమితులయ్యారు. 

Ramesh Bais Replaces Koshyari As Maharashtra Governor, Prez Makes Fresh Appointments

న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల  గవర్నర్లను నియమించారు .   ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర గవర్నర్ గా  అబ్దుల్ నజీర్ ను  నియమించారు . ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను  ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేశారు.  ఏపీ రాష్ట్రానికి అబ్దుల్ నజీర్ ను  కొత్త గవర్నర్ గా  నియమించారు రాష్ట్రపతి.అయోధ్య పై  సుప్రీంకోర్టు ధర్మాసనం  ఇచ్చిన  తీర్పులో   అబ్దుల్ నజీర్  సభ్యుడిగా  ఉన్నారు.   ఈ ఏడాది  జనవరి  4న  అబ్దుల్ నజీర్  సుప్రీంకోర్టు జడ్జిగా  రిటైరయ్యారు

అరుణాచల్ ప్రదేశ్  గవర్నర్ గా   లెఫ్టినెంట్  జనరల్  కైవల్యను  నియమించారు. సిక్కిం గవర్నర్ గా   లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను నియమించారు.   జార్ఖండ్  రాష్ట్ర గవర్నర్ గా  రాధాకృష్ణన్ నియమించారు. హిమాచల్ ప్రదేశ్  గవర్నర్ గా శివప్రతాప్ శుక్లాను నియమించారు.  అసోం గవర్నర్ గా  గులాబ్ చంద్ కటారియాను  నియమించారు రాష్ట్రపతి. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్  రాష్ట్ర గవర్నర్ గా  ఉన్న సుశ్రీ అనసూయఉకే  మణిపూర్  గవర్నర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ గా ఉన్న గణేశన్  నాగాలాండ్  గవర్నర్ గా నియమించారు. 

బీహార్ రాష్ట్ర గవర్నర్ గా  ఉన్న  సాగు చౌహన్ ను మేఘాలయ గవర్నర్ గా  నియమించారు.  హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా  రాజేంద్ర విశ్వనాథ్  ఆర్లేకర్   బీహర్ గవర్నర్ గా  నియమించారు. మహారాష్ట్ర గవర్నర్  గా  జార్ఖండ్  గవర్నర్ రమేష్ బైస్ ను నియమించారు. అరుణాచల్ ప్రదేశ్  గవర్నర్ గా ఉన్న  బి.డి మిశ్రాను  లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించారు. 

మహరాష్ట్ర గవర్నర్ గా  భగత్ సింగ్ కోష్యారీ , లడఖ్ లెఫ్టినెంట్  గవర్నర్  రాధాకృష్ణన్ మాథుర్  రాజీనామాలను  రాష్ట్రపతి ఆమోదించారు.ఈ మేరకు  రాస్ట్రపతి  సెక్రటేరియట్  ప్రకటించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios