PM Modi Ayodhya Visit: ప్రధాని మోడీ అయోధ్య పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
PM Modi Ayodhya Visit: జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్‌ని అధికారికంగా వెల్లడించారు. ప్రధాని మోడీ అయోధ్య పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..
PM Modi Ayodhya Visit: రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 22న అయోధ్యకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ అయోధ్య పర్యటన అధికారిక కార్యక్రమం వెలువడింది. ఇందులోభాగంగా ప్రధాని సోమవారం ఉదయం అయోధ్యకు చేరుకుంటారు. ఆపై మధ్యాహ్నం 12.05 గంటలకు శ్రీరామ జన్మభూమి ఆలయంలో ప్రాణ ప్రతిష్ట పూజలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటలకు అయోధ్యలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 2:15 గంటలకు కుబేర్ తిలలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రధాని మోదీ ఉదయం 10.25 గంటలకు అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.55 గంటలకు శ్రీరామజన్మభూమి ఆలయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయాన్ని సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ పూజ ప్రారంభం కానుంది, ఇందులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.55 గంటల వరకు కొనసాగనుంది.
రామ మందిర ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలు పూర్తి కాగానే ప్రధాని అక్కడి నుంచి వెళ్లిపోతారు. మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రధాని మోదీ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు ఈ కార్యక్రమంలో ఉంటారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో అయోధ్యకు సంబంధించి కొన్ని ప్రణాళికలను ప్రధాని మోడీ ప్రకటించవచ్చని భావిస్తున్నారు. మధ్యాహ్నం 2.10 గంటలకు కుబేర్ తిలాలోని శివాలయాన్ని ప్రధాని సందర్శించి పూజిస్తారు.
ప్రధాని మోడీ అయోధ్య పర్యటన షెడ్యూల్ ఇదే..
10.25 గంటలకు అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కి వస్తారు.
10.55 గంటలకు అయోధ్య ఆలయానికి చేరుకుంటారు.
11-12 గంటల వరకూ ఆలయంలోనే ఉంటారు.
12.05 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.
12.55 గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
1-2 గంటల మధ్యలో బహిరంగ సభలో పాల్గొంటారు
2 గంటలకు కుబేర్ తిలలో శివాలయ సందర్శన
11 రోజుల పాటు ప్రధాని మోదీ దీక్ష
అదే సమయంలో జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠకు ముందు 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ (జనవరి 12న వీడియో సందేశంలో) తెలిపారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ప్రజలైన మీ అందరి ఆశీస్సులు కోరుతున్నానన్నారు. ఈ దీక్షలో భాగంగా ప్రధాని మోదీ నేలపై నిద్రిస్తూ కొబ్బరినీళ్లు తాగుతున్నారు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. అలాగే, ప్రధాని దేశవ్యాప్తంగా దేవాలయాలను సందర్శించి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీరంగంలోని ప్రసిద్ధ శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అక్కడ ప్రధాని ఏనుగు నుండి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.