Asianet News TeluguAsianet News Telugu

రామ్ కా ధామ్ : రామాలయానికి పాటను అంకితం చేసిన పద్మశ్రీ కైలాష్ ఖేర్.. ఎంత బాగా పాడారో మీరూ వినండి..

ప్రముఖ గాయకుడు పద్మశ్రీ కైలాష్ ఖేర్ తన తాజా పాట 'రామ్ కా ధామ్'ని అయోధ్యలోని ప్రసిద్ధ రామాలయానికి అంకితం చేశారు. జనవరి 22న జరిగే ఆలయ సంప్రోక్షణ కార్యక్రమానికి ఆయనకు ఆహ్వానం కూడా అందింది.

Ram Ka Dham : Padmashri Kailash Kher who dedicated song to Ram Temple Listen how beautiful - bsb
Author
First Published Jan 19, 2024, 1:37 PM IST

అయోధ్య : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించబడిన వారిలో గాయకుడు కైలాష్ ఖేర్ కూడా ఉన్నారు. అతను తన తాజా పాట 'రామ్ కా ధామ్'ను రామాలయం పవిత్ర కార్యక్రమం 'ప్రాణ్ ప్రతిష్ఠ' ఆచారానికి అంకితం చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, ఖైలాష్ ఖేర్ ఈ విషయాన్ని చెబుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిరం 'ప్రాణ్‌ప్రతిష్ఠ' కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బాలీవుడ్ సంగీతకారుడు కైలాష్ ఖేర్‌కు ఆహ్వానం అందింది. కైలాష్ తన కొత్త పాట 'రామ్ కా ధామ్' గురించి మాట్లాడుతూ, "దేశమంతా పవిత్రమైన ఆలయ ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తోంది, ఇది చూస్తుంటే దేశమంతా ఇప్పుడు మరోసారి దీపావళిని జరుపుకుంటున్నట్లు అనిపిస్తుంది. ప్రపంచం మొత్తం ఈ సందర్భాన్ని జరుపుకుంటున్నప్పుడు, పాట 'రామ్. కా ధమ్ రామాలయ నిర్మాణ నేపథ్యం, ​​దానివెనకున్న పోరాటాలు, బాధల గురించి మాట్లాడుతుంది."

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట: మోడీ పాటిస్తున్న కఠిన నియమాలు...

ఆయన మాట్లాడుతూ... "నెలన్నర క్రితమే నాకు ఆహ్వానం అందింది.  నాకు చాలా ఆనందంగా ఉంది. నాపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నాకు ఈ దేశం, దేశప్రజలంటే ఎంతో ఇఫ్టం. వారిని నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. వారిని నేను అభిమానులు అని పిలవను, వారు నా హృదయంలో భాగం. వారందరికీ ఈ వేడుకకు నాకు ఆహ్వానం అందడం మీద కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రామ మందిరం 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు ఆహ్వానం అందినందుకు చాలా సంతోషంగా ఉంది. వేడుకకు హాజరవ్వాలని చాలా ఉత్సాహంగా ఉన్నాను" అన్నారు.

"ఈ సందర్భానికి నేను మా దివంగత తండ్రిని స్మరించుకుంటూ ధోతీ కట్టుకోబోతున్నారు. నా దివంగత తల్లిదండ్రులు కూడా అలా కనిపించడానికి ఇష్టపడతారు, సంతోషించేవారని నమ్ముతున్నా" అన్నారు. 

జనవరి 18, గురువారం, దూరదర్శన్ నేషనల్ ప్రధాన స్టేషన్ 'శ్రీ రామ్ లల్లా' పేరుతో భజనను ప్రసారం చేసింది. ఈ పాటను సోనూ నిగమ్ పాడారు. ఈ పాటలో అయోధ్యలోని డ్రోన్ చిత్రాలతో పాటు నగరంలోని ఒక దేవాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రార్థనలు చేస్తున్న దృశ్యాన్ని చూపించారు. ముకుల్ వర్మ, అమితాబ్ ఎస్ వర్మ ఈ భజన సాహిత్యం రాశారు. నిగమ్ పాడారు. సౌండ్‌ట్రాక్‌ను అమితాబ్ ఎస్ వర్మ సమకూర్చారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22, సోమవారం రామాలయం ప్రారంభానికి ముందు ఈ పాట ప్రసారం అయ్యింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios