Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ కన్నుమూత

మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ కన్నుమూశారు.

Ram Jethmalani, Eminent Supreme Court Lawyer and Former Law Minister, Passes Away at 96
Author
New Delhi, First Published Sep 8, 2019, 9:32 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ ఆదివారం నాడు కన్నుమూశారు.ఆయన వయస్సు 96 ఏళ్లు.

దేశంలోని పలు సంచలనం సృష్టించిన కేసులను రాంజెఠ్మలానీ వాదించారు. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా కేసుతో పాటు పీవీ నరసింహరావు కేసులను కూడ ఆయన వాదించారు.

2017లో ఆయన తన న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పారు. రాంజెఠ్మలానీ కొడుకు కూతురు కూడ లాయర్లే. కొడుకు మహేష్ జెఠ్మలానీ  ప్రముఖ న్యాయవాది. 1923 సెప్టెంబర్ 14న సింధ్‌ ప్రావిన్సులోని సిఖర్పూర్‌లో  ఆయన జన్మించారు. సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఎన్నో కేసులు వాదించారు.

బార్ కౌన్సిల్ చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. 1959లో కేఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర సర్కార్ కేసు, అలాగే 2011 మద్రాసు హైకోర్టులో రాజీవ్ గాంధీ హంతకుల కేసు, స్టాక్ మార్కెట్ కుంభకోణంలో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్‌ల కేసు, అఫ్జల్ గురు ఉరిశిక్ష, జెస్సికా లాల్ మర్డర్ కేసులను ఆయన వాదించారు..

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును రామ్ జెఠ్మలానీ వాదించారు. అరుణ్ జైట్లీ, కేజ్రీవాల్ పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించారు. ఎన్టీఆర్ కేసును కూడయ ఆయన వాదించారు. 

ఆరు, ఏడో లోక్‌సభలలో సభ్యుడిగా ఉన్నారు. ముంబై నుంచి రెండు సార్లు బీజేపీ నుంచి గెలిచారు. వాజ్‌పేయి సర్కార్‌లో న్యాయశాఖ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

Follow Us:
Download App:
  • android
  • ios