Asianet News TeluguAsianet News Telugu

రాఘవ్ చద్దా.. నీ చద్దా తీసిపారేస్తా: ఆప్ నేతపై రాఖీ సావంత్ ఘాటు వ్యాఖ్యలు

ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాపై రాఖీ సావంత్ సీరియస్ అయ్యారు. తనకు, తన పేరుకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. లేదంటే చద్దా తీసిపారేస్తారని కామెంట్ చేశారు. తన పేరును ప్రస్తావించడంతో ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నారని, దీని ద్వారా తన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవాలని సూచించారు.

rakhi sawant slams raghav chadha for dragging her into their politics
Author
New Delhi, First Published Sep 18, 2021, 1:47 PM IST

న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అరవింద్ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను విమర్శిస్తూ నవ్‌జోత్ సింగ్ సిద్దూ విడుదల చేసిన వీడియోపై ఆయన స్పందిస్తూ కొత్త చిక్కులు తెచ్చుకున్నారు. పంజాబ్ పాలిటిక్స్‌కు ఆయన రాఖీ సావంత్ వంటివారని సిద్దూపై నోరుపారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. ఒక మహిళను అందులోకి లాగాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. తాజాగా, స్వయంగా రాఖీ సావంత్ స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాఘవ్  చద్దా కామెంట్స్‌ను మీడియా ప్రతినిధులు రాఖీ సావంత్ ముందు ప్రస్తావించగా ఆమె సీరియస్ అయ్యారు. ‘రాఘవ్  చద్దా.. నాకు, నా పేరుకు మీరు దూరంగా ఉండండి. లేదంటే నువ్ రాఘవ్ చద్దా కదా.. నీ చదద్దా తీసిపారేస్తా.. ’ అంటూ కామెంట్ చేశారు. చద్దా కామెంట్ కారణంగా రాఖీ సావంత్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాఘవ్ చద్దా ట్రెండింగ్‌లోకి రావడానికి తన పేరు అవసరం వచ్చిందని, తానేంటో దీని ద్వారా అంచనా వేసుకోవాలని అన్నారు.

కాగా, ఆమె భర్తగా చెప్పుకునే పేరున్న ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్‌నూ ఆమె పోస్టు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్, రాఘవ్ చద్దా, పంజాబ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఆ ఖాతా పోస్టు చేసింది. ‘మీ రాజకీయ లబ్ది కోసం సంబంధం లేని ఓ మహిళ వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయవద్దు. అరవింద్ కేజ్రీవాల్ మీ ఎమ్మెల్యేను ఎడ్యుకేట్ చేయండి. నేను ఎడ్యుకేట్ చేయడం ప్రారంభిస్తే ఆప్ ఎక్కడా కనిపించదు’ అని ఆ ట్వీట్ ఉన్నది. దాని స్క్రీన్ షాట్‌ను రాఖీ సావంత్ ఇన్‌స్టాలో పోస్టు చేశారు.

 

ఆప్‌పై, ఢిల్లీ ప్రభుత్వంపై నవ్‌జోత్ సింగ్ సిద్దూ విమర్శలు చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆప్ ప్రాథమిక, పంజాబ్ ఆప్ విభాగపు ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ ఆ వీడియోను ట్వీట్ చేశారు. ఇందులో సిద్దూ మాట్లాడుతూ, గతేడాది కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద సాగు చట్టాలు తెచ్చిందని, అందులో ఒకటి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నోటిఫై చేసిందని పేర్కొన్నారు. దాన్ని మళ్లీ డీనోటిఫై చేశారా? లేక అదే రెండు నాల్కల ధోరణి పాటిస్తూ రైతుల మద్దతుదారుగా నటిస్తున్నారా? అని ప్రశ్నించారు.

సిద్దూ చేసిన విమర్శలను రాఘవ్ చద్దా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. నవ్‌జోత్ సింగ్ సిద్దూ పంజాబ్ రాజకీయాలకు రాఖీ సావంత్ అని, ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై నాన్‌స్టాప్‌గా చేసిన విమర్శలతో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అక్షింతలు అందుకున్నారని పేర్కొన్నారు. నేడు కొంత మార్పుగా కెప్టెన్‌ను వదిలి అరవింద్ కేజ్రీవాల్ వెంటపడ్డారని ఆరోపించారు. ‘రేపటి వరకు ఆగండి.. కెప్టెన్‌పై మళ్లీ ఆయన దుర్భాషను పునరుద్ధరిస్తారు’ అని చురకలంటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios