Asianet News TeluguAsianet News Telugu

ట్రాక్టర్లలో డీజిల్ నింపుకుని సిద్ధంగా వుండండి: రైతులకు రాకేశ్ టికాయత్ పిలుపు

ట్రాక్టర్లలో డీజిల్ నింపుకుని సిద్ధంగా వుండండి.. ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లాల్సి రావొచ్చంటూ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టీకాయత్. వ్యవసాయ చట్టాలకు మద్ధతుగా రైతుల మద్ధతు కూడగట్టేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తానని రాకేశ్ తెలిపారు.

Rakesh Tikait to tour 5 states in March to drum up support for farmers ksp
Author
new delhi, First Published Feb 28, 2021, 5:20 PM IST

ట్రాక్టర్లలో డీజిల్ నింపుకుని సిద్ధంగా వుండండి.. ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లాల్సి రావొచ్చంటూ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టీకాయత్. వ్యవసాయ చట్టాలకు మద్ధతుగా రైతుల మద్ధతు కూడగట్టేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తానని రాకేశ్ తెలిపారు.

ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్,కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా ఆయన బహిరంగ సభలు నిర్వహించనున్నారు. రేపట్నుంచి రాకేశ్ టికాయత్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. 

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిని శాంతింపజేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 విడతలుగా చర్చలు జరిపింది.

అయినప్పటికీ ఇరు పక్షాలకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సాగు చట్టాలపై రైతు సంఘాల నేతలతో చర్చలకు తాము ఎప్పుడైనా సిద్ధంగానే వున్నట్లు ప్రకటించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.

వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని, అందువల్ల ఈ చట్టాలను అమలు చేయలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉందని తోమర్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios