విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. కార్మికుల పోరాటానికి రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు మద్ధతు పలికాయి.

పలువురు ప్రముఖులు కూడా ఉద్యమానికి బాసటగా నిలిచారు. తాజా విశాఖ ఉక్కు ఉద్యమానికి తమ మద్దతు తెలిపారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
26 సంస్థలను అమ్మాలని కేంద్రం చూస్తోందని.. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయొద్దని టికాయత్ విజ్ఞప్తి చేశారు. సాగుచట్టాలను వెనక్కి తీసుకోవాలని.. దీనిపై రైతులతో కేంద్రం వీలైనంత త్వరగా చర్చలు జరపాలని రాకేశ్ డిమాండ్ చేశారు.
కొత్తగా కనీస మద్దతు ధరతో చట్టం తేవాలని టికాయత్ డిమాండ్ చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం బిజీగా ఉందని.. అవి పూర్తయ్యాక చర్చలు జరుపుతుందేమో అంటూ సెటైర్లు వేశారు. రైతుల ఉద్యమాన్ని శాంతియుత మార్గాల్లో మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు.