Asianet News TeluguAsianet News Telugu

మేము మద్దతు ఉపసంహరించుకోలేదు

రెజ్లర్ల నిరసన తాము మద్దతును ఉపసంహరించుకోలేదని రాకేష్ టికైత్ చెప్పారు. రెజ్లర్లు సాక్షి మాలిక్ , బజరంగ్ పునియా తిరిగి రైల్వే ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత, రెజ్లర్ల ప్రదర్శన ముగుస్తుందని వాదనలు వచ్చాయి. అయితే.. ఈ వాదనలను రెజ్లర్లు స్వయంగా ఖండించారు.
 

Rakesh Tikait SAYS We Have Not Withdrawn Support To Wrestlers krj
Author
First Published Jun 7, 2023, 6:59 AM IST

రెజ్లర్ల ఉద్యమం నుండి రైతు సంఘాలు మద్దతు ఉపసంహరించుకోలేదని భారత రైతు సంఘం ప్రతినిధి, నాయకుడు రాకేష్ టికైత్ తెలిపారు. రెజ్లర్ల డిమాండ్‌ మేరకు జూన్‌ 9న భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని మాత్రమే రద్దు చేసినట్లు తెలిపారు.

పిటిఐ కథనం ప్రకారం.. రెజ్లర్లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం కావడంపై రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాతో భేటీపై రైతు నేతలకు రెజ్లర్లు చెప్పలేదని నివేదికలో పేర్కొన్నారు. ఆ తర్వాత  రెజ్లర్ల నిరసన ప్రదర్శన నుండి తన మద్దతును ఉపసంహరించుకున్నారు. అయితే తాము ఇంకా రెజ్లర్లకు మద్దతిస్తున్నామని రైతు నాయకుడు స్పష్టం చేశారు.

"ఢిల్లీలో మా జూన్ 9 ప్రదర్శన ప్రస్తుతానికి వాయిదా పడింది. ప్రభుత్వ అధికారులు, నిరసన తెలిపే మల్లయోధుల మధ్య సమావేశం ఫలితం కోసం మేము వేచి ఉంటాము. మేము (రైతుల సంఘం) మల్లయోధులకు మద్దతుగా ఉన్నాము. వారికి మా మద్దతును కొనసాగిస్తాము." తికైత్ తెలిపారు. 
 
రెజ్లర్లకు ప్రభుత్వ ప్రతినిధుల మధ్య తదుపరి సమావేశం గురించి మీకు తెలుసా అని ప్రశ్నించగా.. తదుపరి సమావేశం ఎప్పుడు జరుగుతుందో తనకు తెలియదని బదులిచ్చారు. నివేదిక ప్రకారం.. శనివారం సమావేశంలో వారి డిమాండ్లలో చాలా వరకు అంగీకరించడానికి ప్రభుత్వం సుముఖత చూపినప్పటికీ, లైంగిక దోపిడీకి పాల్పడినట్లు రెజ్లర్లు ఆరోపించిన WFI చీఫ్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయడానికి ప్రభుత్వం  అంగీకరించలేదని తెలుస్తోంది. బ్రిజ్ భూషణ్ సింగ్ అరెస్టుకు సంబంధించి రెజ్లర్లు తమ డిమాండ్‌పై మొండిగా ఉన్నారు. దీంతో సమావేశం అసంపూర్తిగా ముగిసింది.

రెజ్లర్లు, హోం మంత్రి మధ్య జరిగిన సమావేశానికి తనను దూరంగా పెట్టారని ప్రశ్నించగా రాకేష్ తికైత్ మాట్లాడుతూ..  తాము ఇటీవల సమావేశం గురించి తెలుసుకున్నామనీ, మల్లయోధులతో సమన్వయంతో ఉన్నామని అన్నారు. ఏదైనా పెద్ద నిరసన/ప్రదర్శనను నిర్వహించమని మేము కోరామని అన్నారు.

శుక్రవారం కురుక్షేత్రలో జరిగిన మహాపంచాయత్ సందర్భంగా బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తికైత్ ఢిల్లీ 'ధర్నా'ను ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని, నిరసన తెలుపుతున్న రెజ్లర్లను తిరిగి ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు తీసుకువస్తామని బెదిరించారు.

సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని అతని నివాసంలో పనిచేస్తున్న వారితోపాటు అతని సహచరుల వాంగ్మూలాలను ఢిల్లీ పోలీసులు మంగళవారం నమోదు చేశారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద సింగ్‌పై నమోదైన కేసుకు ఆధారమైన బాలిక, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 164 ప్రకారం తాజా స్టేట్‌మెంట్‌ను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios