Asianet News TeluguAsianet News Telugu

చంపేస్తాం.. రైతు ఉద్య‌మ నేత‌కు బెదిరింపు కాల్స్

భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​కు బెదిరింపు కాల్స్​ వచ్చాయి. తొలుత అస‌భ్యక‌రంగా మాట్లాడి.. ఆపై చంపేస్తాన‌ని.. రోజులు లెక్క‌పెట్టుకోమ‌ని  బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు తెలిపారు. దీంతో ఆయ‌న ఘజియాబాద్‌లోని కౌశాంబి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఆయ‌న ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు చేశారు.  
 

RAKESH TIKAIT RECEIVES DEATH THREAT FIR LODGED IN GHAZIABAD
Author
Hyderabad, First Published Dec 6, 2021, 11:43 AM IST

దేశంలో బెదిరింపుల క‌ల్చ‌ర్ రోజురోజుకూ పెరుగుతోంది. త‌మ మాట విన‌ని వారిని, త‌మ‌కు వ్య‌తిరేకంగా న‌డుచుకునే వారిని భ‌య‌పెట్ట‌డం కామ‌న్ అయ్యింది. తాజాగా భారతీయ కిసాన్​ యూనియన్​ ( Bharatiya kisan union)  నేత రాకేశ్​ టికాయిత్​ (rakesh tikait) కు బెదిరింపు కాల్స్​ వచ్చాయి. దీంతో ఆయ‌న ఘజియాబాద్‌లోని కౌశాంబి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఆయ‌న ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు చేశారు.  

నిందితుడు తొలుత అస‌భ్యక‌రంగా మాట్లాడి.. ఆపై చంపేస్తాన‌ని.. రోజులు లెక్క‌పెట్టుకోమ‌ని  బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు  అధికారులు తెలిపారు. ఆ కాల్స్ ఉత్త‌రాఖండ్ నుంచి వ‌చ్చిన‌ట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. త్వ‌ర‌లోనే ఆ నిందితుడిని ప‌ట్టుకుంటామ‌ని పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జీ సచిన్​మాలిక్ తెలిపారు. ఆడియో క్లిప్‌ను టికాయిత్ ద్వారా అందుకొని, దాని ఆధారంగా తదుపరి విచారణ జరుపుతామని వెల్లడించారు. అయితే దాని వెనుకున్న ఉద్దేశాన్ని బయటపెట్టలేదని చెప్పారు.

Read Also: https://telugu.asianetnews.com/national/india-reports-8-306-new-covid-19-cases-r3oglo

ఈ ఉద్య‌మ‌నేత‌కు గ‌తంలోనూ అనేక సార్లు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. ఆయ‌నను హత్య చేయాల‌ని ప‌లు కుట్ర‌లు కూడా జ‌రిగాయి. వీటిని తెలుసుకున్న పోలీసులు భ‌గ్నం చేశారు. ఆ త‌రువాత నుంచి ఆయ‌న‌కు కూడా భ‌ద్ర‌త క‌ల్పిస్తోన్నారు. కేంద్రం రూపొందించిన నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేప‌ట్టారు. వారి ఉద్య‌మం ఉప్పెన‌లా ఎగిసిన విష‌యం తెలిసిందే. ఈ ఉద్య‌మంలో ఘాజీపుర్ సరిహద్దు నుంచి టికాయిత్​ నాయ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో అనేక నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌బ‌డ్డాయి. ఈ స‌మ‌యంలో అనేక బెదిరింపులు, కుట్ర‌లు వెలుగులోకి వ‌చ్చాయి. 

Read Also: https://telugu.asianetnews.com/national/people-wearing-lungi-not-criminals-says-rashid-alvi-on-up-dy-cms-comments-r3ngms

ఇదే స‌మ‌యంలో  ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న మాలిక్​ను హత్య చేసేందుకు ప్రయత్నించిన కిషోర్, సోనూలను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘ‌ట‌న డిసెంబ‌ర్ 3 న జ‌ర‌గ‌గా.. ఆలస్యంగా వెలుగులోకి వ్చచింది. ఈ కుట్ర‌కు ప్ర‌ధాన సూత్రాధారులుగా మోదీనగర్‌కు చెందిన వీర్​సేన్​, సంజయ్ ల‌ని గుర్తించారు. ఇందుకోసం.. జైళ్లో శిక్ష అనుభ‌విస్తున్న కిషోర్, సోనూల‌కు పెరోల్ మీద బ‌య‌ట‌కు ర‌ప్పించ‌న‌ట్టు , ఈ ప‌నికోసం వారిద్ద‌రికి రూ.10 లక్షల మేర సుపారీ ఇచ్చారని చెప్పారు.

ఆ నిందితుల‌ను  రెండు రోజుల క్రితం భోజ్‌పుర్‌లో పట్టుకున్నారు. ఆ త‌రువాత వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో వీర్​సేన్​, సంజయ్ ​ప్రధాన్​లను అదుపులోకి తీసుకున్నారు. అటు టికాయత్‌ ఇష్యూపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతులు. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. 

Follow Us:
Download App:
  • android
  • ios