Rajyasabha Elections 2022: మహారాష్ట్రలోని 6 రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఈ నేప‌థ్యంలో ఓటింగ్‌కు ముందు, శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని, ఆ కూట‌మి అభ్య‌ర్థికే ఓటు వేయాలని AIMIM నిర్ణయం తీసుకుంది. 

Rajyasabha Elections 2022: రాజ‌స‌భ్య ఎన్నిక‌లు ఉత్కంఠ భ‌రితంగా సాగుతున్నాయి. నేడు మహారాష్ట్రలోని 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (MVA) అభ్యర్థికి ఓటు వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌గారికి ఓటు వేయనున్నారు. ఈ మేర‌కు ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ .. త‌న‌ పార్టీ నిర్ణయాన్ని ట్విట్ట‌ర్ వేదికగా వెల్ల‌డించారు. ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు మహావికాస్ అఘాడీ అభ్యర్థికే ఓటు వేస్తారని ట్వీట్‌లో తెలిపారు.

“రాజ్యసభ స్థానానికి పోటీ చేస్తున్న‌ INCIndia అభ్యర్థి ShayarImranకి ఓటు వేయాలని మా ఇద్ద‌రు AIMIM మహారాష్ట్ర ఎమ్మెల్యేలను పార్టీ నిర్ణ‌యించింది. బీజేపీని ఓడించేందుకు.. మా పార్టీ aimim మహారాష్ట్రలో రాజ్యసభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (MVA) అభ్య‌ర్థికి ఓటు వేయాలని నిర్ణయించింది. మా మ‌ధ్య‌ రాజకీయ/సైద్ధాంతిక విభేదాలు ఉన్న MVAలో భాగస్వామి అయిన ShivSenaతో కొనసాగుతున్నాం.. పార్టీ త‌రుపున MVA అభ్య‌ర్థికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము " అని మంత్రి జలీల్ ట్వీట్ చేశారు.

మహా వికాస్ అఘాడి (MVA) కూట‌మికే మా మ‌ద్ద‌తు 

రాజ్యసభ ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించేందుకు.. మహావికాస్ అఘాడీ అభ్యర్థికి ఓటు వేయాలని మా పార్టీ నిర్ణయించిందని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ తెలిపారు. సిద్ధాంతిక విభేదాలున్న మహా వికాస్ అఘాడి (MVA) కూట‌మికి మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌నీ, త‌మ పార్టీకి చెందిన‌ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌గారికి ఓటు వేస్తారని ఆయన అన్నారు.

ఈ మేర‌కు ధులియా, మాలేగావ్ అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి తమ పార్టీ కొన్ని షరతులు పెట్టిందని ఇంతియాజ్ జలీల్ తెలిపారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో మైనారిటీ సభ్యులను నియమించాలని, మహారాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని AIMIM పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని తెలిపారు.

ఎఐఎంఐఎం ఎంపి ఇంతియాజ్ జలీల్ మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. మా ఇద్దరి ఎమ్మెల్యేల ప్రాంతంలో అభివృద్ధి జరగాలి కాబట్టి మేము ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాము. కొన్ని సమస్యలపై ప్రభుత్వంతో చర్చించామని, వాటిపై ప్రభుత్వం నుంచి హామీ లభించింది. ఆ తర్వాత ప్రభుత్వానికి మా మద్దతు ప్రకటించాం. ప్రభుత్వంతో ముస్లీంలకు రిజర్వేషన్ కల్పించాలనే చర్చ కూడా జరిగిందని తెలిపారు 

మహారాష్ట్రలోని 6 రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీపీ, బీజేపీ మధ్యే ప్రత్యక్ష పోరు నెలకొంది. మహారాష్ట్రలో రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థి గెలవాలంటే దాదాపు 42 ఓట్లు అవసరం. ఇక్క‌డ బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలతో పాటు 7గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మ‌ద్ద‌తు ఇస్తున్నారు. దీంతో బీజేపీకి 113 ఓట్లు ఉన్నాయి. ఈ బలంతో రెండు సీట్లు సులభంగా గెలుస్తోంది. ఇంకో స్థానంలో విజయం సాధించాలంటే.. 42 ఓట్లలో 13 ఓట్లు తక్కువగా ఉన్నాయి.