బెంగుళూరు: కరోనాతో బీజేపీకి చెందిన ఎంపీ ఆశోక్ గస్తీ మరణించాడు. ఈ నెల 2వ తేదీన ఆయన శ్వాస సంబంధమైన  సమస్యతో బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తే ఆయనకు కరోనా సోకినట్టుగా తేలింది.

న్యూమోనియాతో పాటు పలు అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఈ పరీక్షల్లో తేలింది. ఐసీయూలోనే ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. 

గురువారం నాడు రాత్రి పదిన్నర గంటలకు గస్తీ ఆసుపత్రిలో మరణించాడు.  ఈ ఏడాది జూలై 22వ తేదీన గస్తీ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన నెలల వ్యవధిలోనే గస్తీ మరణించాడు.

కర్ణాటకలోని రాయచూరు జిల్లాకు చెందినయ ఆశోక్ గస్తీ బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. గురువారం నాడు  సాయంత్రమే ఆయన చనిపోయినట్టుగా ప్రచారం సాగింది. కానీ ఆయన అప్పటికే సీరియస్ గా ఉన్నారు. కానీ రాత్రి పదిన్నర గంటల సమయంలో మరణించినట్టుగా  ఆసుపత్రివర్గాలు తెలిపాయి.