ShivSena leader Sanjay Raut: రాజ్యసభ ఎన్నికలు 2022లో మహారాష్ట్రలోని 6 సీట్లలో, బీజేపీ 3 సీట్లు గెలుచుకుంది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఒక్కో సీటు గెలుచుకున్నాయి.
Sanjay Raut-Election Commission: నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఎట్టకేలకు మహారాష్ట్ర ఫలితాలు వచ్చాయి. ఇక్కడ బీజేపీ 3 సీట్లు గెలుచుకుంది. అదే సమయంలో మహావికాస్ అఘాడి 3 సీట్లు గెలుచుకుంది. అయితే, ఈ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించడంతో పాటు పలు పలు మహారాష్ట్రలో గందరగోళాన్ని సృష్టించాయి. ఈ క్రమంలోనే శివసేన స్పందిస్తూ ఎన్నికల కమిషన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వైపు మొగ్గు చూపిందని, శివసేన ఎమ్మెల్యే సుహాస్ కాండే వేసిన ఓటు తిరస్కరణపై ఈసీ చర్యపై తన వైఖరిని స్పష్టం చేసిందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీ అనుకూలంగా ముందుకు సాగిందంటూ పరోక్షంగా ఆరోపించారు. "ఎన్నికల సంఘం మా ఒక ఓటు చెల్లుబాటు కాకుండా చేసింది. రెండు ఓట్లపై మేము అభ్యంతరం చెప్పాము కానీ దానిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. ఎన్నికల సంఘం వారికి (బీజేపీ) అనుకూలంగా ఉంది" అని సంజయ్ రౌత్ మీడియాతో అన్నారు.
ఇంతలో, కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి తన విజయాన్ని ప్రకటించాడు మరియు మిగిలిన అభ్యర్థుల సంఖ్యను కూడా ధృవీకరించాడు. "నేను శివసేనకు చెందిన సంజయ్ రౌత్ మరియు ఎన్‌సీపీకి చెందిన ప్రఫుల్ పటేల్‌తో పాటు గెలిచాను. నేను ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. (మహా వికాస్ అఘాడి) సంజయ్ పవార్ నాల్గవ అభ్యర్థి గెలవలేకపోయినందుకు మాకు బాధగా ఉంది" అని ప్రతాప్‌గర్హి అన్నారు. మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు, కౌంటర్లు అందడంతో ఓట్ల లెక్కింపు స్వల్పంగా నిలిచిపోయింది.
అంతకుముందు, మహారాష్ట్రలో రాజ్యసభ ఎన్నికల్లో అధికార మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పోల్ కోడ్‌ను ఉల్లంఘించారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శుక్రవారం ఆరోపించింది. వారి ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారిని కోరారు. ఎన్సీపీ నేత జితేంద్ర అవద్, కాంగ్రెస్ నేత యశోమతి ఠాకూర్, శివసేనకు చెందిన సుహాస్ కాండే ఓట్లు చెల్లవని ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. శివసేన శాసనసభ్యుడు సుహాస్ కాండే వేసిన ఓటును లెక్కించవద్దని మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఈసీ ఆదేశించింది. ఈ విషయంపై మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నానా పటోలే మాట్లాడుతూ.. 'ఓటమి భయంతో కౌంటింగ్‌ను ఆపేందుకు బీజేపీ ప్రయత్నించింది' అని అన్నారు. "మేము బీజేపీఎమ్మెల్యే ఎస్ ముంగంటివార్ & స్వతంత్ర ఎమ్మెల్యే (రవి రాణా)పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసాము. ఎన్నికల సంఘం ఈ విషయం విన్నది. ఓటమి భయంతో బిజెపి కౌంటింగ్ ప్రక్రియను ఆపడానికి ప్రయత్నించింది, అయితే మహా వికాస్ అఘాడి గెలుస్తుంది " అని నానా పటోల్ అన్నారు. మహారాష్ట్రలోని 6 స్థానాల్లో బీజేపీ 3 సీట్లు గెలుచుకుంది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఒక్కో సీటు గెలుచుకున్నాయి. ఎన్నికల్లో శివసేనకు చెందిన సంజయ్ పవార్ ఓడిపోయారు.
