రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, తమిళ నాడు కు చెందిన అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకులు తంబిదురై గుండుపోటుకు గురయ్యారు. తమిళ నాడు రాజధాని చెన్నైలో ఉండగా అకస్మాత్తుగా అతడికి ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపాయారు. దీంతో అతడి సహాయక సిబ్బంది వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. సమయానికి సరైన వైద్యం అందడంతో అతడు ప్రాణాలతో బైటపడినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

అన్నాడీఎంకే పార్టీలో ముందునుంచి సీనియర్ నాయకుడిగా వున్న తంబిదురై ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆయన అన్నాడీఎంకే పార్టీలో కీలక నాయకుడిగా మారారు. ప్రస్తుతం అధికారంలో వున్న అన్నాడీఎంకే పార్టీని కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేయడంలో తంబిదురై ముఖ్య పాత్ర వహించారు. 

జయలలిల మరణం తర్వాత సరైన నాయకుడు లేకుండా కష్టకాలంలో వున్న అన్నాడీఎంకే పార్టీలో మరో కీలక నాయకుడు అనారోగ్యానికి గురవడంతో అటు నాయకులతో పాటు ఇటు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.