రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు బుధవారం నాడు భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యసభలో మంగళవారం నాడు విపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరును ఆయన ప్రస్తావిస్తూ కంటతడిపెట్టుకొన్నారు. 

న్యూఢిల్లీ: రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు బుధవారం నాడు రాజ్యసభలో కంటతడిపెట్టుకొన్నారు. మంగళవారం నాడు రాజ్యసభలో విపక్షపార్టీలకు చెందిన ఎంపీలు వ్యవహరించిన తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడిపెట్టుకొన్నారు.

Scroll to load tweet…

మంగళవారం నాడు చోటు ఎగువసభలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన గుర్తు చేసుకొన్నారు. ఈ ఘటనలు తనను చాలా బాధకు గురి చేశాయని ఆయన చెప్పారు. కొందరు విపక్ష పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరుతో తాను నిన్న రాత్రంతా నిద్రపోలేదని ఆయన చెప్పారు. సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

లోకసభ నిరవధికంగా వాయిదా పడింది. షెడ్యూల్ కన్నా ముందే లోకసభ వాయిదా వడింది. ఈ నెల 13వ తేదీ వరకు లోకసభ సమావేశాలు జరగాల్సి ఉండింది. అయితే నిత్యం ప్రతిపక్షాలు సభను స్తంభింపజేస్తున్నాయి. పెగాసెస్, కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చ జరగాలని సభలో ఆందోళనకు దిగుతున్నాయి. రాజ్యసభను కూడా ప్రతిపక్షాలు నిత్యం స్తంభిజేస్తున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి మాత్రం ప్రతిపక్షాలు సహకరించాయి.