విపక్ష పార్టీలకు చెందిన 11 మంది ఎంపీలపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. సస్పెన్షన్‌కు గురైన కాలాన్ని నిబంధనల అతిక్రమణకు తగిన శిక్షగా పరిగణించాలని ప్రివిలేజ్ కమిటీ రాజ్యసభ ఛైర్మన్‌కు సిఫార్సు చేసినట్లుగా పీటీఐ నివేదించింది.

విపక్ష పార్టీలకు చెందిన 11 మంది ఎంపీలపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. సస్పెన్షన్‌కు గురైన కాలాన్ని నిబంధనల అతిక్రమణకు తగిన శిక్షగా పరిగణించాలని ప్రివిలేజ్ కమిటీ రాజ్యసభ ఛైర్మన్‌కు సిఫార్సు చేసినట్లుగా పీటీఐ నివేదించింది. నివేదిక ప్రకారం.. సస్పెండ్ చేయబడిన సభ్యులు బుధవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక ప్రసంగానికి హాజరుకాలేరని కమిటీ పేర్కొంది. 

11 మంది ఎంపీలు ప్రత్యేక హక్కుల ఉల్లంఘన, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌ ధిక్కారానికి పాల్పడ్డారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో కాంగ్రెస్‌కు చెందిన జేబీ మాథర్, ఎల్ హనుమంతయ్య, నీరజ్ డాంగి, రాజమణి పటేల్, కుమార్ కేత్కర్, జీసీ చంద్రశేఖర్, సీపీఐ బినోయ్ విశ్వం.. డీఎంకే కు చెందిన మహమ్మద్ అబ్ధుల్లా, సందోష్ కుమార్ పీ.. సీపీఎంకు చెందిన జాన్ బ్రిట్టాస్, ఏఏ రహీమ్ వున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో గందరగోళానికి కారణమైన 146 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. అలాగే కట్టుదిట్టమైన భద్రత వుంటే పార్లమెంట్‌లోకి బయటి వ్యక్తులు దూసుకురావడం కలకలం రేపింది. 

132 మంది ఎంపీల సస్పెన్షన్ గడువు డిసెంబర్ 29న ముగియడంతో ఉభయ సభలను ప్రోరోగ్ చేయడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు కేవలం ఆ సెషన్ వరకు మాత్రమే వీలవుతుంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు కుదించబడిన బడ్జెట్ సెషన్‌లో ముగ్గురు లోక్‌సభ సభ్యులు సహా 14 మంది ఎంపీలు పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయబడిన 11 మంది ఎంపీలు.. తమ సస్పెన్షన్‌ను సమీక్షించాల్సిందిగా అభ్యర్ధించడానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్‌ను సంయుక్తంగా కలిసినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ఎంపీలను సస్పెండ్ చేసే ముందు సస్పెన్షన్ నిబంధనలు, పరిస్థితులు .. రెండింటినీ సభాపతి పరిగణనలోనికి తీసుకుని ఉండాల్సిందని వారు చెబుతున్నారు. రూల్ 256 ప్రకారం.. ఛైర్మన్ కౌన్సిల్ నుంచి సభ్యుడిని మిలిగిన సెషన్‌కు మించకుండా సస్పెండ్ చేయవచ్చని ఓ నేత అన్నారు.