బెంగుళూరు: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నాడు తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణం చేశారు.జీ సూట్ ధరించి రాజ్‌నాథ్ సింగ్ ఈ విమానంలో ప్రయాణం చేశారు. 

 ఈ తేలికపాటి యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రక్షణమంత్రిగా ఆయన రికార్డులకెక్కారు.ఈ యుద్ధ విమానాన్ని  స్వదేశీ సాంకేతికతో  ఈ యుద్తధ విమానం తయారైంది. కేంద్ర రాజ్‌నాథ్ సింగ్  పైలెట్ వెనుక సీటులో కూర్చొన్నాడు.

 

యుద్ధానికి వెళ్లే సమయంలో ఈ విమానంలో కూర్చొనే ఆర్మీ సిబ్బంది ధరించినట్టుగానే కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడ తలకు హెల్మెట్ కూడ ధరించాడు.

అంతేకాదు ఆక్సిజన్ మాస్క్ ను కూడ పెట్టుకొన్నాడు. ఇద్దరు మాత్రమే ఈ విమానంలో ప్రయాణం చేయవచ్చు. ఇండియా ఎయిర్‌పోర్స్ కు చెందిన ఉన్నతాధికారులు ఎన్. తివారీ తోపాటు పలువురు రాజ్‌నాథ్ సింగ్ ను  తేజస్ యుద్ధవిమానం వరకు తీసుకొచ్చారు.కొంత సమయం యుద్ధ విమానాన్ని కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ నడిపినట్టుగా డిఆర్‌డిఓ చీఫ్ రీసెర్చ్ అధికారి  సతీష్ రెడ్డి చెప్పారు.