రాజ్ నాథ్ సింగ్ కు కోవిడ్-19 పాజిటివ్.. హోం క్వారంటైన్ లోకి వెళ్లిన రక్షణ శాఖ మంత్రి
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా సోకింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఆయనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని అధికారులు తెలిపారు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా సోకింది. ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు. వైద్యుల బృందం సింగ్ ను పరీక్షించిందని, విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వాస్తవానికి ఆయన ఈ రోజు ఢిల్లీలో జరగాల్సిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కు హాజరుకావాల్సి ఉంది. కానీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు.
బాలీవుడ్ లో విషాదం.. యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా కన్నుమూత
ప్రస్తుతం స్వల్ప లక్షణాలతో ఉన్న రక్షణ శాఖ మంత్రి హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. కాగా.. ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కేంద్ర ఉక్కు, పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సింధియా తనకు కోవిడ్ రిపోర్టు పాజిటివ్ గా వచ్చిందని సోమవారం ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.