మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదిని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ టార్గెట్ చేస్తూ.. ఆమె పేరు చెప్పకుండా "సీజనల్ హిందువు" అని పిలిచారు. కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, వాస్తవాన్ని వారు అర్థం చేసుకోవాలని సింగ్ ఆరోపించారు.

మధ్యప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మరికొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై విమర్శలు గుప్పించారు. రాజ్‌గఢ్‌లో జరిగిన ‘కిసాన్ కళ్యాణ్ మహాకుంభ్’లో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, వాస్తవాన్ని వారు అర్థం చేసుకోవాలని ఆరోపించారు. మధ్యప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి.. కాంగ్రెస్ ఐదు హామీలను ఇస్తోందని విమర్శించారు.

అంతకుముందు రోజు ప్రియాంకా గాంధీ నర్మదా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రియాంకా గాంధీని ఉద్దేశిస్తూ రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ కాంగ్రెస్ లో కొందరు వ్యక్తులు సీజనల్ హిందువులుగా మారారు. తాజాగా వారు ఏ కార్యక్రమానికి ముందు అయినా.. నర్మదా నది పూజిస్తున్నారు. ఇంతకు ముందు నర్మదా నదిని ఎందుకు గుర్తుపట్టలేదు..ఇప్పుడు నర్మదానదిని ఎందుకు స్మరించుకుంటున్నారు?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ.. హనుమంతుడి గద్దెతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారనీ, అంతకుముందు రాముడు, హనుమాన్ పేర్లను కూడా ఉచ్చరించేవారు కాదని విమర్శించారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేయడాన్ని వ్యతిరేకించింది ఇదే కాంగ్రెస్. నాలుగు ప్రభుత్వాలను బలిదానాలు చేయాల్సి వచ్చింది.... ఇప్పుడు హనుమంతుడి గద్దెతో ప్రజాధనాన్ని తప్పుదోవ పట్టించేందుకు వచ్చారనీ, అయితే వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. 

ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ ఐదు హామీలు ఇస్తామని ప్రకటించిందనీ, కమల్ నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తుంది కానీ.. వాటిని ఎప్పుడు నెరవేర్చదని రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. బీజేపీ హామీలను నెరవేరుస్తుందనీ, సీఎం శివరాజ్ సింగ్ కు ప్రజామద్దతు ఉందని, ఈసారి కూడా బీజేపీ భారీ మెజారిటీతో మధ్యప్రదేశ్ లో అధికారం కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, నరేంద్రమోడీ హాయంలో వ్యవసాయ బడ్జెట్ ను రూ. 25,000 కోట్ల నుంచి రూ. 1.25 లక్షల కోట్లకు పెంచిందని, రామమందిర నిర్మాణాన్ని చేపడుతోందని, రక్షణ రంగంలో భారీ ఎత్తున అభివృద్ది జరిగిందని అన్నారు. 

బీజేపీ హామీ మేరకు అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది జనవరి 22న అక్కడ రాంలాలా ప్రతిష్ఠించనున్నట్లు సమాచారం. రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ హనుమంతుడి గద్ద ఉంటుదని అన్నారు. ఎంపీపీలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. ఇప్పుడు తాజాగా ఐదు ‘గ్యారంటీ’ల హామీని ఇస్తున్నారని విమర్శించారు. రైతుల రుణమాఫీకి సంబంధించిన మొదటి హామీని కూడా వారు (కాంగ్రెస్) నెరవేర్చలేదని రక్షణ మంత్రి అన్నారు. ప్రపంచంలోనే భారత్ శక్తివంతంగా మారిందని, మనల్ని సవాలు చేసే సాహసం ఎవరూ చేయరని అన్నారు.

ప్రియాంక గాంధీ సోమవారం జబల్‌పూర్‌లోని హిందువులు పవిత్రంగా భావించే నర్మదా నది వద్ద ప్రార్థనలు చేయడం ద్వారా రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. హనుమంతుడి గద్ద ప్రతిరూపాన్ని కూడా కాంగ్రెస్ ఆయన బహిరంగ సభ స్థలంలో ఏర్పాటు చేసింది.