Asianet News TeluguAsianet News Telugu

బీజేపీతో సంబంధాలు.. అందుకే నిజమైన దోషులపై చర్యల్లేవ్.. : మోర్బీ బ్రిడ్జి దుర్ఘటనపై రాహుల్ గాంధీ

Rajkot: 'మోర్బీ ప్రమాదంలో 150 మంది మరణించారు. ఇది రాజకీయ సమస్య కాదు. దీనికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది' అని కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అన్నారు.  బీజేపీతో సంబంధాల కార‌ణంగానే నిజ‌మైన దోషుల‌పై చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆయ‌న ఆరోపించారు.
 

Rajkot : "Relations with THE BJP. No action will be taken against the real culprits: Rahul Gandhi on Morbi Bridge tragedy
Author
First Published Nov 21, 2022, 10:47 PM IST

Congress leader Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, వ‌య‌నాడ్ పార్లమెంట్ స‌భ్యులు రాహుల్ గాంధీ మ‌రోసారి బీజేపీ స‌ర్కారును టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.  'మోర్బీ ప్రమాదంలో 150 మంది మరణించారు. ఇది రాజకీయ సమస్య కాదు. దీనికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది' అని రాహుల్ గాంధీ అన్నారు.  బీజేపీతో సంబంధాల  కార‌ణంగానే నిజ‌మైన దోషుల‌పై చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆయ‌న ఆరోపించారు.

 

వివ‌రాల్లోకెళ్తే.. సోమ‌వారం నాడు రాహుల్ గాంధీ గుజ‌రాత్ లో ప‌ర్య‌టించారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న రాజ్ కోట్ లో ప్ర‌చార ర్యాలీని  నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మోర్బి వంతెన కూలిపోవడానికి కారణమైన వారిపై గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బీజేపీ తో సంబంధాల కార‌ణంగానే నిజ‌మైన దోషుల‌పై చ‌ర్య‌లు తీసుకోలేద‌ని విమ‌ర్శించారు. మోర్బీ ప్రమాదంలో 150 మంది చనిపోయారు. ఇది రాజకీయ సమస్య కాదు. దీనికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని అన్నారు. "ప్రమాదానికి కారణమైన వారు బీజేపీతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నందున, వారికి ఏమీ జరగలేదు. వారు ఇద్దరు వాచ్‌మెన్‌లను పట్టుకున్నారు.. అరెస్టు చేశారు, కానీ వాస్తవానికి బాధ్యులపై ఏమీ చ‌ర్య‌లు తీసుకోలేదు" అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 

 

కాగా, అక్టోబర్ 30న మోర్బీలో మ‌చ్చున‌దిపై ఉన్న చాలా సంవ‌త్స‌రాల నాటి వేలాడే వంతెన కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో 140 మందివ‌ర‌కు ప్రాణాలు కోల్పోయార‌ని మీడియా నివేదిక‌లు పేర్కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో మ‌రణించిన వారిలో 47 మంది చిన్నారులు ఉండ‌గా, అత్య‌ధికం మ‌హిళ‌లు ఉన్నారు. ఇక మోర్బీ వంతెన కూలిన ఘ‌ట‌నపై స్పందించిన రాహుల్ గాంధీ.. దోషుల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఇది అవినీతిపరుల అభివృద్ధి అంటూ మండిప‌డ్డారు. ఇదే బీజేపీ అవినీతి & కమీషన్ నమూనా అంటూ ట్వీట్ చేశారు. 

కాగా, ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ దేశ‌వ్యాప్త కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. అయితే, వ‌చ్చే నెల‌లో గుజార‌త్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సోమ‌వారం నాడు గుజరాత్ లో ప‌ర్య‌టించారు. రాజ్ కోట్, సూర‌త్ ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో పాల్గొన్నారు. డిసెంబరు 1, 5 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీకి రెండు ద‌శ‌ల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో తన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రెండు ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించేందుకు భార‌త్ జోడో యాత్ర‌కు రాహుల్ గాంధీ బ్రేక్ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios