NITI Aayog: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవి నుంచి రాజీవ్ కుమార్ వైదొలగగా ఆయ‌న స్థానంలో సుమన్ బేరీ నియమితులయ్యారు. గ‌త‌ ఐదేళ్ల క్రితం భారత పాలసీ థింక్‌ ట్యాంక్‌లో నియమితులైన నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన తర్వాత ఆర్థికవేత్త సుమన్ బెరీ అధికారంలోకి వచ్చారు. 

NITI Aayog: నీతి ఆయోగ్ నూత‌న చైర్మన్ నియామకం పూర్తిగా ఖరారైంది. ఐదేళ్ల క్రితం పాలసీ థింక్‌ ట్యాంక్‌ నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌‌గా నియామకైన రాజీవ్‌ కుమార్‌.. అనుహ్యంగా తన పదవికి రాజ‌నామా చేసి నుంచి వైదొలగాలని నిర్ణ‌యించుకున్నారు. రాజీవ్ కుమార్ తన పూర్వీకుడు అరవింద్ పనగారియా నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా నుండి నిష్క్రమించిన తర్వాత ఆగస్టు 2017లో వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు, ఇది ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అని పిలుస్తారు.

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవి నుంచి రాజీవ్ కుమార్ వైదొలగగా, ఆయన స్థానంలో సుమన్ బేరీ నియమితులయ్యారు. ఐదేళ్ల క్రితం భారత పాలసీ థింక్‌ ట్యాంక్‌లో నియమితులైన నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన తర్వాత ఆర్థికవేత్త సుమన్ బెరీ అధికారంలోకి వచ్చారు. ఇటీవ‌ల.. మంత్రివర్గం నియామకాల కమిటీ రాజీవ్ కుమార్ రాజీనామాను ఆమోదించిందని, సుమన్ బేరీని నీతి ఆయోగ్‌లో పూర్తికాల సభ్యునిగా మరియు తరువాత మే 1 నుండి వైస్ చైర్‌పర్సన్‌గా నియమించిందని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

రాజీవ్ కుమార్ ఈ నెల 30న ఆయ‌న పూర్తిగా బాధ్య‌త‌ల నుంచి వైదొలుగుతార‌ని తెలిపింది. వ్య‌వ‌సాయ రంగం, పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ త‌దిత‌ర అంశాల్లో నీతి ఆయోగ్ వైస్ చైర్మ‌న్‌గా రాజీవ్ కుమార్ కీల‌క పాత్ర పోషించారు. ల‌క్నో యూనివ‌ర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన రాజీవ్ కుమార్‌.. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో డీఫిల్ పూర్తి చేశారు. సెంట‌ర్ ఫ‌ర్ పాల‌సీ రీసెర్చ్ సీనియ‌ర్ ఫెలోగా ఉన్నారు.

ఇక డాక్ట‌ర్ సుమన్ బెరీ విష‌యానికి వ‌స్తే.. రాజీవ్ కుమార్ వారసుడిగా డాక్ట‌ర్ సుమన్ బెరీ విధుల్లోకి చేర‌నున్నారు. సుమ‌న్ బెరీ.. 2001 నుండి 2011 వరకు 10 సంవత్సరాల పాటు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCAER డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. అతను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి, స్టాటిస్టికల్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానానికి సంబంధించిన సాంకేతిక సలహా కమిటీలో కూడా సభ్యుడు.

సుమన్ బెరీ.. ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో సీనియర్ విజిటింగ్ ఫెలో, వాషింగ్టన్ DCలోని వుడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్ యొక్క ఆసియా ప్రోగ్రామ్‌లో గ్లోబల్ ఫెలో. అతను బ్రస్సెల్స్‌లో ఉన్న ఒక ఆర్థిక విధాన పరిశోధనా సంస్థ అయిన బ్రూగెల్‌లో నాన్-రెసిడెంట్ ఫెలో.