భారత సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని జవాన్ల త్యాగాన్ని కొనియాడారు ప్రముఖ  పారిశ్రామిక వేత్త, బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్. ‘‘ప్రతి ఏడాది డిసెంబర్ 1 నుంచి 7 వరకు భద్రతా దళాల వారోత్సవాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో డిసెంబర్ 7ను సాయుధ దళాల పతాక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దేశాన్ని, మనల్ని కాపాడుతూ సరిహద్దుల్లో గస్తీ కాస్తూ ప్రాణాలర్పించిన అమరవీరులకు, మాజీ సైనికులు, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ’’ ఆయన ట్వీట్ చేశారు.

1949 నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ఈ రోజున త్రివిధ దళాలలో పనిచేసే సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం విరాళాలను సేకరిస్తారు.