నగ్నంగా పోలీసు స్టేషన్ కు వెళ్తున్న మహిళను కొంత మంది ఫొటోలు తీశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా, నగ్నంగా నడిచివెళ్తున్న ఆమెను మొబైల్ లతో ఫోటోలు తీశారని పోలీసులు చెప్పారు.
చురు: రాజస్థాన్ లో సభ్య సమాజం తల దించుకునే సంఘటన చోటు చేసుకుంది. అత్తింటివారు ఓ మహిళ దుస్తులను చింపేసి, తోసేశారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి మహిళ నగ్నంగా పోలీసు స్టేషన్ కు చేరుకుంది.
నగ్నంగా పోలీసు స్టేషన్ కు వెళ్తున్న మహిళను కొంత మంది ఫొటోలు తీశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా, నగ్నంగా నడిచివెళ్తున్న ఆమెను మొబైల్ లతో ఫోటోలు తీశారని పోలీసులు చెప్పారు.
ఈ సంఘటన చురు జిల్లాలోని బిదాసర్ ప్రాంతంలో ఆదివారంనాడు జరిగింది. మాటా మాటా పెరగడంతో అత్త, వదిన మహిళను వేధించారని పోలీసులు చెప్పారు. ఆమె దుస్తులను చించేశారని అన్నారు.
తన భర్త లేని వేళల్లో చాలా కాలంగా అత్తింటివారు తనను వేధిస్తున్నారని మహిళ ఫిర్యాదు చేసింది. బాధను భరించలేని మహిళ ఫిర్యాదు చేయడానికి అత్యంత దయనీయమైన స్థితిలో పోలీసు స్టేషన్ కు చేరుకుంది.
నగ్నంగా ఉన్న బాధితురాలి ఫొటోలు కనిపించినా, సోషల్ మీడియాలో వైరల్ చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని సుజన్ గఢ్ ఎఎస్పీ సీతారామ్ మహిచ్ హెచ్చరించారు. మహిళ భర్త దినసరి కూలీ అని, అస్సాంలో పనిచేస్తున్నాడని పోలీసులు చెప్పారు. మహారాష్ట్రలోని ఆకోలాకు చెందిన ఆ మహిళ పెళ్లి తర్వాత రాజస్థాన్ కు వచ్చింది.