రాజస్తాన్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఆమె స్కూల్‌లో పీఈటీ టీచర్. ఆమె స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 

జైపూర్: రాజస్తాన్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. స్టూడెంట్‌ను పెళ్లి చేసుకోవడానికి ఆ టీచర్ జెండర్ చేంజ్ చేసుకుంది. ఆమె లింగ మార్పిడి చేసుకున్న తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇదంతా ఒక ట్విస్ట్‌లా ఉంటే.. మరో అనూహ్యమైన మలుపు ఏమంటే.. వీరి పెళ్లిని రెండు కుటుంబాలూ అంగీకరించాయి. మన దేశంలో లింగ మార్పిడికే పెద్దగా ఆమోదం లభించదు. అలాంటిది వారి పెళ్లిని కూడా అంగీకరించడం చర్చనీయాంశమైంది.

Scroll to load tweet…

రాజస్తాన్‌లోని భరత్‌పూర్ వీరిద్దరూ కలిశారు. అక్కడ ఓ స్కూల్‌లో మీరా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆమె కల్పనా ఫౌజ్‌దార్ అనే విద్యార్థినితో ప్రేమలో పడింది. కల్పన స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్. ఆమె జనవరిలో ఇంటర్నేషనల్ కబడ్డీ టోర్న‌మెంట్‌లో ఆడటానికి జనవరిలో దుబాయ్ వెళ్లాల్సి ఉన్నది.

Also Read: మళ్లీ మొదలైన పెళ్లిళ్ల సీజన్.. కొత్త జీవితం మొదలుపెట్టనున్న లక్షలాది మంది యువత.. వచ్చే నెల 14 వరకు లక్షల కోట్ల

స్కూల్ ప్లే గ్రౌండ్‌లో వీరిద్దరికీ సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత ఆ స్టూడెంట్‌ను పెళ్లి చేసుకోవాలని మీరా అనుకున్నది. అందుకు జెండర్ చేంజ్ కూడా చేసుకోవడానికి మీరా రెడీ అయింది. తాను ఎప్పుడూ అబ్బాయిగా ఉండాలని భావించానని ఆరవ్ కుంతల్ (జెండర్ మార్పిడి తర్వాత మీరా పేరు) అనుకున్నాడు. ‘నేను పుట్టుకతో అబ్బాయిని. కానీ, ఎప్పుడూ అబ్బాయిగా ఉండాలని కోరుకునేదాన్ని. లింగ మార్పిడి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకునేవాడిని. 2019 డిసెంబర్‌లో తనకు తొలి సర్జరీ జరిగింది’ అని వివరించారు.

ప్రేమలో అన్నీ సవ్యంగానే ఉంటాయని, అందుకే నేను జండర్ కూడా చేసుకున్నాను అని పేర్కొన్నారు.

కాగా, పెళ్లి కూతురు కల్పన మాట్లాడుతూ, తాను ఆరవ్‌తో చాలా కాలంగా ప్రేమలో ఉన్నానని తెలిపింది. ఆరవ్ తన లింగ మార్పిడి చేసుకోకున్నా.. అతడినే పెళ్లి చేసుకునేవాడిని అని వివరించింది. నేను మొదటి నుంచి అతడిని ప్రేమించా అని పేర్కొంది. ఆయన ఈ సర్జరీ చేయకున్నా పెళ్లి చేసుకునేదాన్ని అని తెలిపింది. ఆయనకు సర్జరీ చేయించడానికి తాను కూడా వెంట వెళ్లినట్టు వివరించింది.

Also Read: భార్యకు తెలియకుండా రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. పెళ్లి పీటల మీద పెద్ద ట్విస్ట్.. ఏం జరిగిందంటే ?

వారి పెళ్లి అసాధారణమైన విషయమే. అయినప్పటికీ వారి పెళ్లిని రెండు కుటుంబాలూ అంగీకరించాయి.