ఏడు సంవత్సరాల క్రితం మైనర్ బాలికపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడినందుకు గాను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి బరాన్‌లోని పోక్సో కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹ 10 లక్షల జరిమానా విధించింది.
ఉపాధ్యాయ వృత్తి అంటే.. ఒకప్పుడూ ఎంత పవిత్రమైన భావన ఉండేది. కానీ కొందరూ ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల కీచకుల్లా ప్రవర్తిస్తూ.. ఆ వృత్తికే మాయని మచ్చ తీసుకొస్తున్నారు. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి, మార్గాన్ని నిర్దేశించే ఉపాధ్యాయులు.. తమ కామ కోరికలను తీర్చుకోవడానికి విద్యార్థినులను లోభరచుకుని వారి జీవితాలను ఛీద్రం చేస్తున్నారు. ఇలాంటి కామాంధులు మన వ్యవస్దలో ఛీడ పురుగుల్లా వ్యవహరిస్తున్నారు. అలా ఏడు సంవత్సరాల క్రితం ఓ కీచక ఉపాధ్యాయుడు మైనర్ బాలికపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇందుకు గాను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి బరాన్‌లోని పోక్సో కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹ 10 లక్షల జరిమానా విధించింది.
వివరాల్లోకెళ్తే.. ఏడు సంవత్సరాల క్రితం.. రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని గెండోలి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిపై .. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విశ్వేంద్ర మీనా (32) కన్నేశాడు. ఆ విద్యార్థిని మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని తన ఫోన్ లో చిత్రీకరించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసి పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని ఆ కామాంధుడు బాలికకు వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియోలను చూపించి బ్లాక్‌మెయిల్ చేసి ఏడాదిపాటు ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ విషయం బాధితురాలి తండ్రికి తెలియడంతో నవంబర్ 10, 2016న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.9వ తరగతి చదువుతున్న తన కుమార్తెపై మీనా అనే ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాని ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కీచక ఉపాధ్యాయుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసు విచారించిన బరాన్‌లోని పోక్సో కోర్టు నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹ 10 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
