రాజస్థాన్‌లో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు అడ్డులేకుండా పోయింది. తాజాగా కరౌలీలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మైనర్ బాలికపై కన్నేశాడు. ఉచితంగా స్టార్ట్ ఫోన్ ఇప్పిస్తానని నమ్మించి.. యువతిపై దారుణానికి పాల్పడ్డాడు. తన కామావాంఛ తీర్చుకున్నాడు.
రాజస్థాన్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగి ఓ మైనర్ బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. ఓ ప్రముఖ బ్యాంకులో పనిచేసే వ్యక్తి లైంగికగా దాడికి పాల్పడ్డాడు. అయితే, విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా కలకలం రేపారు. నిందితుడు పీహెచ్‌ఈడీ డిపార్ట్‌మెంట్ క్యాషియర్‌ను ప్రజలు పట్టుకుని, తీవ్రంగా కొట్టారు. పీహెచ్‌ఈడీలో పనిచేస్తున్న ఈ క్యాషియర్ పేరు సునీల్ జంగిద్. నిందితుడి వయసు 35 ఏళ్లు. నిందితుడు 17 ఏళ్ల విద్యార్థినిని ఉచితంగా మొబైల్ ఫోన్ ఇస్తానని ప్రలోభపెట్టి తన వెంట తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు.
ఈ దారుణ ఘటన కరౌలి జిల్లాల్లో చేసుకుంది. PHED లో పనిచేసే ఉద్యోగి సునీల్ జంగిద్. అతని కన్ను ఓ మైనర్ బాలికపై పడింది. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన స్మార్ట్‌ఫోన్ ఉచిత పథకం గురించి.. ఆ 17 ఏళ్ల బాలికకు తెలియజేశాడు. తనకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్ ఇప్పిస్తానని నిందితుడు .. ఆ యువతిని ప్రలోభ పెట్టాడు. మొత్తానికి ఆ యువతి అతని మయమాటాలను నమ్మింది. ఆ తర్వాత నిందితుడు ఆ యువతిని తన స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లాడు. అంతే బాలికపై అత్యాచారం చేశాడు. కాగా, నిందితుడిని స్థానికులు పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
నిందితుడు క్యాషియర్.. మైనర్ బాలికను తన స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లి, కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. అనంతరం అతడు తన కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న నిర్మాష్య ప్రాంతంలో పడవేసినట్లు ఎస్‌హెచ్‌ఓ మీనా తెలిపారు. ఆ బాలిక పరిస్థితిని గమనించిన స్థానికులు ఆరా తీశారు. ఈ క్రమంలో బాధితురాలి స్నేహితులు, స్థానికులు నిందితుడ్ని పట్టుకున్నారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. అయితే.. ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో నిందితులు తప్పించుకోగలిగారు. ఆ తర్వాత బాలిక కుటుంబ సభ్యులు కిడ్నాప్, అత్యాచారం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఏడేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం
మూడు రోజుల క్రితం ఝలావర్ జిల్లాలో ఏడేళ్ల బాలికపై ఆమె 35 ఏళ్ల పొరుగు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇప్పుడు మైనర్ తల్లిదండ్రులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు విష్ణు డాంగిని శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులిద్దరిపై ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
