జీవనాధారం కోసం పోలీస్ స్టేషన్ లో శానిటరీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతోంది. కాగా... ఆమెను మొదటి నుంచి ఆ స్టేషన్ ఇన్ స్పెక్టర్ లైంగికంగా వేధించేవాడు.
ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగి. ప్రజల సమస్యలను తీరుస్తూ.. అక్రమార్కుల భరతం పట్టాల్సిన పోలీసు ఉద్యోగి. ఎవరైనా కామాంధుడు మహిళల పట్ల నీచీంగా ప్రవర్తిస్తే.. వాళ్ల చమడాలు తీయాల్సిన వ్యక్తే.. నీచంగా ప్రవర్తించాడు. తమ ఆఫీసులో పనిచేసే శానిటరీ వర్కర్ తో దారుణంగా ప్రవర్తించాడు. ఆమెకు ఒక్కరోజు సెలవు ఇవ్వడానికి తన శారీరక కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జోధ్ పూర్ కి చెందిన ఓ మహిళ భర్తను కోల్పోయింది. జీవనాధారం కోసం పోలీస్ స్టేషన్ లో శానిటరీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతోంది. కాగా... ఆమెను మొదటి నుంచి ఆ స్టేషన్ ఇన్ స్పెక్టర్ లైంగికంగా వేధించేవాడు. కాగా.. సదరు మహిళ ఇటీవల తనకు సెలవు కావాలని అతనిని కోరింది. అయితే.. సెలవు కావాలంటే.. తన శారీరక వాంఛ తీర్చాలంటూ బలవంతం చేశాడు.
అతని కోరికను తీర్చడం ఇష్టం లేని సదరు మహిళ వెంటనే ఈ విషయం తన యూనియన్ కి తెలియజేసింది. వారంతా వచ్చి.. సదరు పోలీస్ అధికారిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అంతేకాకుండా.. పోలీసు అధికారి ఆమెను అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ బలవంత పెడుతున్న ఆడియో కూడా లీక్ అయ్యింది. ఈ రెండు ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఆ ఇన్ స్పెక్టర్ ని ఉద్యోగం లో నుంచి తొలగించారు. క్రమశిక్షణా రాహిత్యం కింద ఆయన ను సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
