అగ్నిసాక్షిగా భార్య మెడలో తాళికట్టి.. చివరి దాకా తోడు ఉంటానని, ఏ పరిస్థితుల్లోనైనా రక్షణగా ఉంటానన్న భర్త మాట తప్పాడు. తన చేతులతో తానే భార్యను తీసుకువెళ్లి ఓ పశువుకి అప్పగించాడు. భార్యకు ప్రేమగా మార్కెట్ కి వెళదామని మాయ మాటలు చెప్పి.. అదే దారిలో తన స్నేహితుడిని కూడా ఎక్కించుకున్నాడు.

ఇద్దరినీ ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి.. అక్కడ మృగం రూపంలో దాగి ఉన్న తన స్నేహితుడికి భార్యను అప్పగించాడు. ఆ కామాంధుడు తన భార్యపై పశువులా పడి అత్యాచారం చేస్తుంటే.. తాను మాత్రం అక్కడికి మరెవరూ రాకుండా కాపలా కాశాడు. ఈ దారుణ సంఘటన రాజస్తాన్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్తాన్ లోని ఆళ్వార్ జిల్లా షాజహాన్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. ఆ వివాహిత(35)ను ఆమె భర్త... మార్కెట్‌కు వెళ్దామని చెప్పి బైక్ ఎక్కించుకున్నాడు.

దారిలో తన ఫ్రెండ్ మిచ్చు అలియాస్ బల్వంత్ ధనక్‌ను వెంట తీసుకెళ్లాడు. భార్య ఉండగానే అతన్ని కూడా అదే బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బైక్ ఆపాడు. అక్కడ కొద్దిసేపు కూర్చున్న అనంతరం బల్వంత్ సడెన్‌గా లేచి ఫ్రెండ్ భార్య చేయి పట్టుకుని సమీపంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లాడు.  అక్కడ ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్యను ఫ్రెండ్‌కు అప్పజెప్పిన భర్త... ఆమెపై అత్యాచారం జరుగుతుంటే... అటువైపు ఎవరూ రాకుండా గది బయట కాపలా కాశాడు.

ఈ దారుణ ఘటనతో బాధితురాలు షాక్‌కు గురైంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని భర్త, అతని స్నేహితుడు బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన ఆమె తనపై జరిగిన అఘాయిత్యాన్ని కన్వాళ్లకు చెప్పుకుని భోరుమంది. వారి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.