ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కత్తెరతో పొడిచి అతి దారుణంగా హత్య చేశాడు.  అనంతరం భార్య శవం పక్కనే కూర్చొని వీడియో గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ లోని బీజేఎస్ కాలనీకి చెందిన విక్రమ్ సింగ్(35)కి కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైందతి. ఆయనకు భార్య శివ కన్వార్(30) ఉన్నారు. కాగా.. ఆదివారం భార్యభర్తల మధ్య విపరీతంగా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా విక్రమ్ ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు.

ఈ విషయంలో భార్యభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కాగా.. ఆ గొడవ ఆదివారం మరింత ఎక్కువ అయ్యింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన విక్రమ్ సింగ్.. భార్యను కత్తెరతో పొడిచి చంపేశాడు.

కాగా.. చంపేసిన అనంతరం భార్య శవం పక్కనే కూర్చొని వీడియో గేమ్స్ ఆడుతూ ఉండటం గమనార్హం. పోలీసులు వచ్చే సరికి కూడా కూడా అతను తన ఫోన్ లో గేమ్స్ ఆడుతూ కనిపించాడు. అతని భార్య రక్త మడుగులో పడి ఉందని పోలీసులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.