Asianet News TeluguAsianet News Telugu

"బాలికా వధు".. 3 లక్షలకు 14 ఏళ్ల బాలిక‌ విక్ర‌యం.. బాల్య వివాహం చేసుకుని.. గర్భం దాల్చలేదని చిత్ర‌హింస‌లు..  

రాజ‌స్థాన్ లో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. 14 ఏండ్ల బాలిక‌ను రూ. 3 ల‌క్ష‌లకు కొనుగోలు చేసి.. బాల్య వివాహం చేసుకున్నారు 40 ఏళ్ల వ్య‌క్తి. గ‌త 9 నెలలుగా ఆ బాలిక‌పై అత్యాచారం చేస్తూ.. గ‌ర్భం దాల్చ‌డం లేద‌ని చిత్రహింస‌ల‌కు గురి చేశాడు. 

Rajasthan man buys child bride for 3 lakh, tortures her for not conceiving
Author
First Published Sep 16, 2022, 11:49 PM IST

రాజస్థాన్‌లో బాలికల విక్ర‌యం మరోసారి తెరపైకి వచ్చింది. పేద‌రికంలో ఉన్న ఓ తండ్రికి డ‌బ్బు ఆశ చూప‌డంతో 14 ఏళ్ల త‌న స‌వ‌తి కూతురుని  40 ఏళ్ల వ్య‌క్తికి మూడు లక్షల రూపాయలకు విక్రయించాడు. ఆ త‌రువాత ఆ వ్య‌క్తి ఆ బాలిక‌ను పెళ్లి చేసుకుని.. త‌న ఇంటికి తీసుకెళ్లాడు.

గ‌త‌ 9 నెలలుగా బాలికపై ఆ వ్య‌క్తి  ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అయినా గర్భం దాల్చలేదని.. ఆ బాలిక‌ను తీవ్రంగా కొడుతూ.. చిత్రహింస‌లకు గురి చేశాడు. ఆ అణచివేతను భరించే బాధితురాలి.. ఎలాగోలా ఆ కామాంధుడి నుంచి తప్పించుకుంది. చివ‌రికి జైపూర్ పోలీసులు ఆశ్రయించి.. త‌న గోడును వెల్ల‌బోసుకుంది. ఈ దారుణ ఘ‌ట‌న జైపూర్‌లోని జవహర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 


సవతి తండ్రే బాలిక‌ను అమ్మేశాడు

ప‌లు మీడియా క‌థ‌నాల ప్రకారం.. బాధిత బాలిక తన స‌వతి తండ్రితో క‌లిసి ధోల్‌పూర్‌లో కలిసి నివసిస్తుంది. ఇటీవ‌లే ఆ బాలిక తల్లి మరణించింది. ఈ క్ర‌మంలో ఓ వ్య‌క్తి .. త‌న స‌వతి తండ్రికి డ‌బ్బు ఆశ చూసి.. త‌న కూతురిని త‌నకు  విక్రయించాల‌ని కోరాడు. అందుకు  ప్రతిఫలంగా మూడు లక్షల రూపాయలను తీసుకున్నాడు ఆ స‌వతి తండ్రి. గతేడాది  డిసెంబర్ 11 న.. ఆ బాలిక‌ను.. ఆ వ్య‌క్తికి ఇచ్చి.. వివాహం చేశాడు. ఆ బాలిక మైన‌ర్ అప్ప‌టికీ..  గ‌త 9 నెలలుగా అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. పైగా గర్భం దాల్చలేదని.. ఆ బాలిక‌ను తీవ్రంగా హింసించాడు.

ఆ చిత్ర హింస‌లు భ‌రించలేని ఆ బాలిక .. భర్త బారి నుంచి తప్పించుకునేందుకు పలుమార్లు విఫ‌ల ప్రయత్నం చేసింది.  చివ‌రికిగా..గ‌త వారం విజయం సాధించి జైపూర్ చేరుకుంది. ఈ క్ర‌మంలో బాలల హక్కుల సంఘం బచ్‌పన్ బచావో ఆందోళన్ (బీబీఏ) స‌హయంతో ఆ బాలిక‌ పోలీసులను ఆశ్ర‌యించింది. బాలిక ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్టు  పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాధారామన్ గుప్తా తెలిపారు. ఆమెను జైపూర్‌లోని బాలికల ప్రభుత్వ షెల్టర్ హోమ్‌కు పంపారు.

బాల్య వివాహ శాపం

అదే సమయంలో, బచ్‌పన్ బచావో ఆందోళన్ డైరెక్టర్ మనీష్ శర్మ మాట్లాడుతూ..  ఈ సంఘటన బాల్య వివాహాల బాధితుల దుస్థితి,  బాధను ఎత్తి చూపుతుందని అన్నారు. బాల్య వివాహాలను సామాజిక పద్ధతిగా కాకుండా పిల్లలపై జరిగే పెద్ద నేరంగా చూడాల్సిన సమయం ఆసన్నమైంది. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న జవహర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ జీరో నంబర్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

దీనితో పాటు, బాలిక విక్ర‌యం, అత్యాచారం, దాడి విష‌యంలో ప‌లు సెక్షన్లలో కేసు నమోదు చేయబడింది. అదే సమయంలో.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదికను పరిశీలిస్తే.. రాజస్థాన్‌లో నమోదైన అత్యాచార కేసులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లను కూడా అధిగమించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios