ఆవు పేడను కిలో రూ.2 చొప్పున కొనుగోలు చేస్తాం.. కాంగ్రెస్ ఎన్నికల హామీ..

రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. 

Rajasthan elections 2023: CM Gehlot promises will buy cow dung at rs 2 ksm

రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సీఎం అశోక్ గెహ్లాట్.. ఇప్పటివరకు ఏడు హామీలను ప్రకటించారు. అందులో పశువుల యజమమానుల నుంచి ఆవు పేడను కిలో రూ. 2 చొప్పున కొనుగోలు చేస్తామనే హామీ కూడా ఉంది. వివరాలు.. బుధవారం ఝుంజునులో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో తమ రెండు హామీలను గెహ్లాట్ ప్రకటించారు. 

తొలి రెండు హామీల విషయానికి వస్తే.. గృహ లక్ష్మి గ్యారెంటీ పథకం కింద కుటుంబానికి పెద్దగా ఉన్న ప్రతి మహిళకు సంవత్సరానికి రూ. 10,000 వాయిదాల రూపంలో అందజేస్తామని, 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500 చొప్పున ఎల్‌పీజీ సిలిండర్లు అందించనున్నట్టుగా చెప్పారు. ఇక, శుక్రవారం రోజున జైపూర్‌లో గెహ్లాట్ మాట్లాడుతూ.. మరో ఐదు హామీలను ప్రకటించారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం మార్చేందుకు వీలు లేకుండా పాత పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి చట్టం చేస్తామని చెప్పారు. మహాత్మా గాంధీ ఇంగ్లీష్ పాఠశాలల ద్వారా అందరికీ ఉచిత ఆంగ్ల మాధ్యమ విద్యను అందిస్తామని చెప్పారు. ఆంగ్ల విద్యను కళాశాలలకు విస్తరింపజేస్తామని తెలిపారు.

ప్రకృతి వైపరీత్యాలలో నష్టపోయిన కుటుంబాలకు రూ. 15 లక్షల బీమాను కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే అందిస్తుందని హామీ ఇచ్చారు.  ప్రభుత్వ కళాశాలల్లో ఫ్రెషర్‌లకు ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ అందజేస్తామని కూడా చెప్పారు. కిలో ఆవు పేడను రూ. 2 చొప్పున కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు ఆవు పేడను కొనుగోలు చేయడం వల్ల రైతుల ఆదాయాన్ని పెంపొందించడంతోపాటు స్వచ్ఛమైన ఇంధనంగా మారేందుకు వీలు కల్పిస్తుందని కూడా సీఎం గెహ్లాట్ చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios