ఎన్నికల ఓటు హక్కని చాలా మంది చెబుతూ ఉంటారు. ఆ రోజున ప్రజలంతా ఓటు హక్కుని వినియోగించుకోవాలని పిలుపునిస్తూ ఉంటారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా పోలింగ్ శాతం మెరుగుపరచడానికి ఎన్నికల సంఘం తీవ్రంగా కృషిచేస్తోంది.

ప్రజల్లో ఓటు వేయాలనే అవగాహన ఉన్నప్పటికి పోలింగ్ కేంద్రంవైపు వెళ్లడానికి మాత్రం ససేమిరా అంటుంటారు. అయితే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసి పౌరులుగా తమ బాధ్యతను నిర్వర్తించారు ఇద్దరు దంపతులు.

రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు దంపతులు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యారు. ఇవాళ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండటంతో ఓటు వేయడం తమ బాధ్యతగా భావించి కట్లతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. వారిని అధికారులు, స్ధానికులు అభినందించారు.