Asianet News TeluguAsianet News Telugu

ఆడియో టేపుల కలకలం: ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు

రాజస్థాన్ రాష్ట్రంలో  అధికారాన్ని కాపాడుకొనేందుకు ఆ పార్టీ నాయకత్వం అన్ని రకాల అస్త్రాలను వాడుకొంటుంది. సచిన్ పైలెట్ వర్గానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.

Rajasthan crisis: Two Congress MLAs suspended
Author
Rajasthan, First Published Jul 17, 2020, 11:09 AM IST


జైపూర్:  రాజస్థాన్ రాష్ట్రంలో  అధికారాన్ని కాపాడుకొనేందుకు ఆ పార్టీ నాయకత్వం అన్ని రకాల అస్త్రాలను వాడుకొంటుంది. సచిన్ పైలెట్ వర్గానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.

భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్ లను పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసింది. బేరసారాలకు పాల్పడినట్టుగా  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ ఇద్దరిపై ఆరోపణలు చేస్తోంది. 

also read:సచిన్ సహా 18 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు: సుప్రీంకు వెళ్లే యోచనలో పైలెట్

ఆడియో టేపుల్లో బేరసారాలకు పాల్పడినట్టుగా ఓ ఆడియో టేపును కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రస్తావిస్తోంది.బీజేపీతో కలిసి ఆశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆరోపిస్తోంది.

రెండు దఫాలు  సీఎల్పీ సమావేశానికి సచిన్ పైలెట్ వర్గం ఎమ్మెల్యేలు దూరమయ్యారు.  దీంతో సచిన్ పైలెట్ సహా 18 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై సచిన్ పైలెట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం నాడు మధ్యాహ్నం నాడు హైకోర్టు ఈ విషయమై విచారణ చేయనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios